ఎంత.. అన్యాయం!

క్లాసులు బోర్‌ కొట్టి.. కడుపునొప్పి అని అబద్ధం చెప్పి.. డుమ్మా కొట్టా. మర్నాడు వెళ్తే ఫ్రెండ్‌ చెప్పాడు. ‘నిన్న లెక్చరర్లు ఎవరూ రాలేదు. తరగతులు జరగలేదని’.

Published : 29 Apr 2023 00:07 IST

* క్లాసులు బోర్‌ కొట్టి.. కడుపునొప్పి అని అబద్ధం చెప్పి.. డుమ్మా కొట్టా. మర్నాడు వెళ్తే ఫ్రెండ్‌ చెప్పాడు. ‘నిన్న లెక్చరర్లు ఎవరూ రాలేదు. తరగతులు జరగలేదని’.

* చిన్నప్పట్నుంచి పెన్ను మూతని రుచి చూడకుండా పడేసిందే లేదు! అందుకే చెబుతుంటా.. ‘పెన్ను పోతే కొనగలం గానీ క్యాప్‌ని కొనలేం’ అని.

* ఆఫీసుకొస్తే అన్నీ ఉచితం. వినోదానికి వై-ఫై, చల్లదనానికి ఏసీ, గాసిప్‌లు చెప్పే సహోద్యోగులు.. వీటితోపాటు బాస్‌ ఆఫీసుకు రాకపోతే.. ఆరోజు ఆనందం డబుల్‌ ధమాకా. ఇవన్నీ ఉన్నా ఆఫీసంటే చాలామందికి కడుపునొప్పి ఎందుకో అర్థం కాదు.

* అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదంటారు. కానీ గంటకోసారైనా నోటిఫికేషన్ల రూపంలో నా ఆకలి గుర్తు చేస్తుంటుంది జొమాటో. కానీ ఏం లాభం? అంత ప్రేమే ఉంటే.. ఫ్రీగా ఫుడ్‌ పంపొచ్చుగా!

* కరోనా టైంలో కనీసం ఒక్క పరీక్ష రాయకున్నా సీనియర్లని పాస్‌ చేసేశారు. కష్టపడి రాసి నేను 34 మార్కులు తెచ్చుకున్నా ఫెయిల్‌ అంటున్నారు. ఎంత అన్యాయం?

* వేరే దేశాల్లో డిగ్రీ ఫెయిలైతే ‘ఫర్వాలేదు ఇంకోసారి ప్రయత్నించు’ అంటారు అమ్మానాన్నలు. మన దగ్గరైతే పెళ్లి చేసి పెద్ద ప్రమోషన్‌ ఇచ్చేస్తుంటారు. ఇదేం చిత్రమో..!    

సుంకి శ్రావణి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని