కెరియర్‌లో దూసుకెళ్లేది వాళ్లే!

పేరు వెనక పెద్దపెద్ద డిగ్రీలుంటే కెరియర్‌లో కుదురుకున్నట్టే అని భావించే కాలం కనుమరుగైపోతున్నట్టే ఉంది.

Published : 06 May 2023 00:55 IST

పేరు వెనక పెద్దపెద్ద డిగ్రీలుంటే కెరియర్‌లో కుదురుకున్నట్టే అని భావించే కాలం కనుమరుగైపోతున్నట్టే ఉంది. ఇప్పుడు ప్రతిభ ఉన్నవాడికే పట్టం. నైపుణ్యం చూపిస్తేనే అందలం. దేశంలోని పది నగరాల్లో జరిపిన అధ్యయనంలో యువ ఉద్యోగులు, సంస్థ యజమానులు ఇదే మాట చెబుతున్నారు. ఉద్యోగాల కల్పన వెబ్‌సైట్‌ ‘లింక్డ్‌ఇన్‌’ జరిపిన అధ్యయనంలో ఈ అభిప్రాయాలు వెల్లడయ్యాయి. ఫ్రెషర్ల నుంచి మిడ్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయి వరకూ అంతా ఈ నైపుణ్యాల జపమే చేస్తున్నారట. ‘ఇరవై ఏళ్ల కిందట పెద్ద పెద్ద ఉద్యోగార్హత డిగ్రీలు, మేనేజ్‌మెంట్‌తో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నవాళ్లకే పదోన్నతులు, జీతాల పెంపుదల ఉంటుంది అనే అభిప్రాయంతో ఉండేవారు చాలామంది. అందులో వాస్తవమూ ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. సీనియర్‌, జూనియర్‌ అనే తేడా లేకుండా మంచి నెట్‌వర్కింగ్‌, నైపుణ్యాలు ఉన్నవాళ్లకే సంస్థ మేనేజ్‌మెంట్‌ పెద్దపీట వేస్తోంది. 83శాతం ఉద్యోగులు సైతం స్కిల్స్‌ మెరుగుపరచుకుంటేనే కెరియర్‌లో ఎదుగుతాం అని నమ్ముతున్నారు’ అంటూ అధ్యయన వివరాలు బయటపెట్టారు లింక్డ్‌ఇన్‌ ప్రతినిధి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు