నువు చూడూ.. చూడకపో..

మీమ్స్‌ చూడకుండా యువతకు రోజు గడవని కాలమిది. ఈ నేపథ్యంలో  ఒక మీమర్‌ ఫీలింగ్‌..

Published : 06 May 2023 00:54 IST

మీమ్స్‌ చూడకుండా యువతకు రోజు గడవని కాలమిది. ఈ నేపథ్యంలో  ఒక మీమర్‌ ఫీలింగ్‌.. దానికి నెటిజన్ల స్పందన ఎలా ఉంటుందో సరదాగా.

మీమర్‌:

పల్లవి: నువు చూడూ చూడకపో
మీమ్స్‌ చేస్తూనే ఉంటా
లైక్‌ చెయ్యి చెయ్యకపో
మీమ్స్‌ పెడుతూనే ఉంటా
షేర్‌ చెయ్యి చెయ్యకపో
ఆలోచనలు పంచుకుంటూనే ఉంటా
నా ఆశ, నా ధ్యాస
మీమ్సే లెమ్మంట
చరణం: నువు తిట్టినా నీ నుంచి నాకొక
కామెంటొచ్చిందని సంబరపడతా
మీమ్‌ స్కిప్‌ చేసినా నా నుంచి నువు
కంటెంటాశిస్తున్నావని సంతోషిస్తా
మంచి మీమ్‌ను అందించాను
లైక్‌ కొట్టి బతికిస్తావో
స్కిప్‌ చేసి చంపేస్తావో
వైరల్‌ మీమ్‌ను సెండ్‌ చేశాను
కొందరికైనా షేర్‌ చేస్తావో
పట్టుబట్టి డిలీట్‌ చేస్తావో
ఏం చేసినా ఎవరాపినా
మీమ్సే చేస్తుంటా
చరణం 2:
ప్రేమించడం ప్రేమికుడి వంతు
కరుణించడమన్నది ప్రేయసి ఇష్టం
మీమ్స్‌ చేయడం మీమర్స్‌ వంతు
అది చూడటమన్నది నెటిజన్‌ ఇష్టం
ఎందువల్ల మీమ్స్‌ చేస్తున్నానో
మట్టిబుర్రకే తెలియదుగా
మీమ్స్‌ చేయడం ఆపనుగా
ఎందువల్ల నువు లైక్‌ చెయ్యలేదో
ఎదురు ప్రశ్నలే వేయనుగా
ఎదురుచూపులే ఆపనుగా
ఏనాటికో ఒకనాటికి
నీ లైక్‌ సాధిస్తా

నెటిజన్‌:

మీమ్స్‌ చూడాలని ఉన్నా
నే చూడలేకున్నా
లైక్‌ చేయాలని ఉన్నా
నే చెయ్యలేకున్నా
షేర్‌ చెయ్యాలని ఉన్నా
షేర్‌ చెయ్యలేకున్నా
లోలోనా నాలోనా
నిన్నభినందిస్తున్నా.

జముళ్లముడి ఆల్‌ఫ్రెడ్‌, గజ్జలకొండ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు