ఆఫీసు ఫ్రెండూ.. అవసరమేగా
ఆఫీసు పని ఎప్పుడూ సాఫీగా సాగిపోదు. ఒక్కోసారి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. మరోసారి తీరిక లేనంత పని ఉంటుంది. ఆ సమయంలో ఆదుకుంటూ.. బాధ పడితే ఓదార్చే ఫ్రెండ్ సహోద్యోగి అయితే ఎంతో బాగుంటుంది కదూ.
ఏదైనా పని చేస్తున్నప్పుడు పక్కన ఫ్రెండ్ ఉంటే ఆ హుషారే వేరు. చకచకా చేసేస్తుంటాం. ఆఫీసు పనీ అందుకు మినహాయింపేం కాదు! సహోద్యోగులే సన్నిహితులైతే వాళ్లు ఛీర్‌లీడర్లలా మారి.. మన పనిలో ఉత్పాదకత పెరిగేలా చేస్తారంటున్నాయి అధ్యయనాలు. అదెలా అంటే..
* ఆఫీసు పని ఎప్పుడూ సాఫీగా సాగిపోదు. ఒక్కోసారి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. మరోసారి తీరిక లేనంత పని ఉంటుంది. ఆ సమయంలో ఆదుకుంటూ.. బాధ పడితే ఓదార్చే ఫ్రెండ్ సహోద్యోగి అయితే ఎంతో బాగుంటుంది కదూ.
* అర్థం చేసుకునేవాళ్లు.. ఆదుకునేవాళ్లు.. సంతోషాన్ని పంచేవాళ్లు పక్కనే ఉన్నారంటేనే ఉద్యోగులకు ఒకరకమైన ధీమా ఉంటుందట. ఎప్పుడూ ఆ ఫీలింగ్‌లో ఉన్నవాళ్లు కార్యాలయాలకు డుమ్మా కొట్టడం చాలా తక్కువంటున్నాయి అధ్యయనాలు.
* కార్పొరేట్, మార్కెటింగ్, ఐటీ.. ఇలాంటి రంగాల్లో ముందుకెళ్లడానికి టీం వర్క్ కీలక పాత్ర పోషిస్తుంటుంది. సహోద్యోగులే స్నేహితులైతే జట్టుగా, సమష్టిగా ఉత్సాహంగా పని చేయడానికి ఎవరైనా ఇష్టపడతారు.
* ‘వర్క్ ప్లేస్ ఫ్రెండ్షిప్ అండ్ హ్యాపీనెస్’ అనే ఒక అధ్యయనం ప్రకారం.. 35 ఏళ్ల లోపు యువ ఉద్యోగుల్లో 57శాతం మంది.. సహోద్యోగులే తమ క్లోజ్‌ఫ్రెండ్స్ అని చెప్పారు.
* పని చేసే చోట ఉద్యోగుల మధ్య పోటీ వాతావరణం తప్పకుండా ఉంటుంది. స్నేహితులైన సహోద్యోగులతో పోటీ పడాల్సి వస్తే.. సానుకూల పోటీ వాతావరణం ఉంటుందంటున్నాయి అధ్యయనాలు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు
-
Asian Games 2023 : అట్టహాసంగా ఆసియా క్రీడలు ప్రారంభం.. ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
iPhone: ఐఫోన్ డెలివరీ ఆలస్యం.. కోపంతో షాపు ఉద్యోగులనే చితకబాదారు
-
Defamation: కాంగ్రెస్ ఎంపీపై.. అస్సాం సీఎం సతీమణి రూ.10 కోట్లకు దావా!