కళ్లతోనే.. మత్తుమందులా

నిన్ను చూసిన మొదటి క్షణమే నాలో ఏవో చర్య, ప్రతిచర్యల ప్రక్రియలు జరిగాయి. బలహీనంగా ఉండే నా నాడి రైలుబండిలా పరిగెత్తింది.

Updated : 10 Jun 2023 03:40 IST

నిన్ను చూసిన మొదటి క్షణమే నాలో ఏవో చర్య, ప్రతిచర్యల ప్రక్రియలు జరిగాయి. బలహీనంగా ఉండే నా నాడి రైలుబండిలా పరిగెత్తింది. నిన్ను తలచుకున్నప్పుడల్లా నా మైటోకాండ్రియాలో ఎనర్జీ స్థాయిలు పెరుగుతూనే ఉన్నాయి. ఆ మాటకొస్తే అసలు నీ కళ్లలో ఏదో ఎనస్తీషియా ఉంది. అదే నన్ను పదేపదే మైకంలోకి దించేస్తోంది. అలా నువ్వు కురులు వెనక్కి అనుకునే ప్రతిసారీ బాడీలో ఏవో రిఫ్లెక్స్‌ యాక్షన్లు జరుగుతున్నాయి. నువ్వు కనిపించని రోజు పల్స్‌ పడిపోయిన రోగిలా తయారవుతున్నా. దగ్గరికొచ్చినప్పుడేమో.. టచ్‌ మీ నాట్‌ మొక్కలా ముడుచుకపోతున్నా.   అయినా ఫర్వాలేదు.. నీకోసం 24/7 గంటలు పని చేసే హార్ట్‌లా కనిపెట్టుకుంటా. నిరంతరం వైట్‌ బ్లడ్‌ సెల్స్‌లాగా కాపాడుకుంటా. నీదీ నాలాగే బీ పాజిటివ్‌ బ్లడ్‌గ్రూప్‌ అని తెలిశాక.. మన ప్రేమకు అంతా పాజిటివ్‌ అనే ఫిక్సయ్యా. లెట్స్‌ బీ ఇన్‌ సింబయాసిస్‌ అనుకుంటూ నీతో ఏడడుగులు నడవడానికి సిద్ధమవుతున్నా.
ఇట్లు నీ బ్యాక్టీరియా ప్రియుడు
అభితేజ్‌రెడ్డి, ఈమెయిల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని