Fitness: ఆరంభం అదరాలి

ఫిట్‌నెస్‌తో హిట్‌ కొట్టాలన్నా.. సిక్స్‌ప్యాక్‌తో అదరగొట్టాలన్నా క్రమం తప్పని వ్యాయామం కావాలి. మరి కొత్తగా మొదలుపెట్టే వాళ్ల సంగతేంటి అంటారా..? నడకతోపాటు ఇదిగో  ఈ తేలికైన వ్యాయామాలు మొదలుపెట్టేయండి మరి.

Updated : 19 Jun 2021 13:58 IST

ఫిట్‌నెస్‌తో హిట్‌ కొట్టాలన్నా.. సిక్స్‌ప్యాక్‌తో అదరగొట్టాలన్నా క్రమం తప్పని వ్యాయామం కావాలి. మరి కొత్తగా మొదలుపెట్టే వాళ్ల సంగతేంటి అంటారా..? నడకతోపాటు ఇదిగో  ఈ తేలికైన వ్యాయామాలు మొదలుపెట్టేయండి మరి.
 

పులప్స్‌

అప్పర్‌బాడీని తీర్చిదిద్దడంలో పులప్స్‌ పాత్ర ముఖ్యమైంది. శరీరం మొత్తం వేలాడే ఆకృతిలో ఉండటంతో వెన్నెముక, వీపు భాగం బలంగా తయారవుతుంది.


పుషప్స్‌                                  

ఇది బాడీ వెయిట్‌ ఎక్సర్‌సైజ్‌. కండలు, ఛాతీ, వీపు కండరాలు దృఢమై మంచి శరీరాకృతి వస్తుంది. ఎక్కువసార్లు చేతులపై శరీర భారం మోపి కసరత్తులు చేయడంతో చేతులు, కీళ్లు బలంగా తయారవుతాయి.


అబ్డామినల్‌ క్రంచెస్‌

ఇది బాడీవెయిట్‌ వ్యాయామం. పొట్ట చుట్టూ అధికంగా ఉన్న కొవ్వు కరిగి కండరాలు దృఢమవుతాయి. వీపు కండరాలపై సైతం సానుకూల ప్రభావం చూపిస్తుందీ వర్కవుట్‌.


స్క్వాట్‌లు

లోయర్‌ బాడీని దృఢం చేసే వర్కవుట్‌. కాళ్లు, మోకాళ్లను బలంగా, ఫ్లెక్సిబుల్‌గా చేస్తుంది. ఇవి ఎక్కువగా చేస్తుంటే కూర్చోవడం, నిల్చోవడం, నడవడం, వంగడంలాంటి రోజువారీ పనులు తేలికగా చేయగలం.


లాంజెస్‌            

   

లోయర్‌ బాడీకి ఇది మంచి వ్యాయామం. స్ట్రెంగ్త్‌, బ్యాలెన్స్‌.. రెండు విధాలుగా పనికొస్తుంది. మోకీళ్లు, తుంటి, తొడ కండరాలు దృఢమవుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని