ప్రేమించి పెళ్లాడి.. ఇష్టం లేదంటున్నాడు
మీకు పెళ్లై ఎన్ని సంవత్సరాలు? మీ పాప వయసు ఎంత? మీ ఇద్దరికీ వయసులో ఎంత తేడా ఉందో తెలియజేయలేదు. ఇక మీ విషయానికొస్తే మీవారు చిన్నచిన్న విషయాలకే అరుస్తున్నారు, చికాకు పడుతున్నారు అంటున్నారు. పెళ్లైన ఎన్ని సంవత్సరాలకు ఈ మార్పు మొదలైంది?
మాది ప్రేమ పెళ్లి. మాకో పాప. మా ఆయన మొదట్లోలాగా ప్రేమ చూపించడం లేదు. చిన్న విషయాలకే చిరాకు పడుతున్నాడు. అయినా సర్దుకుపోతూనే ఉన్నా. ఈమధ్య తెలిసిన విషయం ఏంటంటే.. తను మరో అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఆమెతో చేసిన చాటింగ్ చూశాను. నా గురించి చెడుగా చెప్పాడు. నేనంటే ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడట. అది చూశాక నా మతి పోయింది. నేనేం చేయాలి?
- ఎస్.సీహెచ్., ఈమెయిల్
మీకు పెళ్లై ఎన్ని సంవత్సరాలు? మీ పాప వయసు ఎంత? మీ ఇద్దరికీ వయసులో ఎంత తేడా ఉందో తెలియజేయలేదు. ఇక మీ విషయానికొస్తే మీవారు చిన్నచిన్న విషయాలకే అరుస్తున్నారు, చికాకు పడుతున్నారు అంటున్నారు. పెళ్లైన ఎన్ని సంవత్సరాలకు ఈ మార్పు మొదలైంది? పాప పుట్టినప్పటి నుంచా? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. పాప పుట్టిన తర్వాత మీరు మీ భర్తకు సమయం కేటాయించలేకపోవడం ఓ కారణం కావొచ్చు. లేదా ఇద్దరూ ఒత్తిడిలో ఉండి ఒకర్నొకరు పట్టించుకోకుండా మనస్పర్థలు కొని తెచ్చుకున్నారేమో. లేదంటే మీ ఆయన ఆఫీసులో ఉండే పని ఒత్తిడి ఇంట్లో చూపిస్తున్నారేమో. దీన్నే ‘డిస్‌ప్లేస్‌మెంట్ ఆఫ్ యాంగర్’ అంటుంటారు. ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఎలాంటి సందర్భాల్లో గొడవ జరుగుతుందో విశ్లేషించండి. ఆ సమయంలో మీ ప్రవర్తన ఎలా ఉంటుంది? మీ ఆయన ఎలా స్పందిస్తున్నారో.. గమనించండి. ఎవరికైనా మనం నచ్చలేదు అంటే అవతలివైపు వారి నుంచి ఆలోచించాలి. అప్పుడు మనలోని తప్పులేంటో కనిపిస్తాయి. ఆ రెండింటినీ అనుసంధానం చేసుకోవడం ద్వారా మీ ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది.
మీవారు మరో అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నారని, మీ గురించి చెడుగా చెబుతున్నారని అంటున్నారు. నిజంగానే అందులో వాస్తవాలు ఉన్నాయా? మీమధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఎలా వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. ఏదేమైనా పెళ్లైన వ్యక్తి మరో అమ్మాయి పట్ల మోజు పెంచుకోవడం ముమ్మాటికీ తప్పే. ఒక మంచి సందర్భం చూసి సావధానంగా ఈ విషయం చెప్పండి. మళ్లీ నేను మీకు నచ్చాలంటే ఏం చేయమంటారో అడగండి. ఆయనలో నచ్చని పద్ధతులు మార్చుకొమ్మని ప్రేమగానే చెప్పండి. అప్పుడప్పుడు ఎటైనా సరదాగా విహారానికి వెళ్లండి. తనతో కొద్దిసేపైనా ప్రేమగా ఉండటానికి ప్రయత్నించండి. అయినా తను మారకపోతే ఇరువైపులా పెద్దలు ఎవరితోనైనా మర్యాదపూర్వకంగా చెప్పించండి. ఇలా చేస్తే తను తప్పకుండా మారతారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కళ్లప్పగించి చూడొద్దు మిత్రమా.. కంటిని హెచ్చరించే సాంకేతిక
-
శిరిడీ సాయి కానుకలతో బంగారు, వెండి నాణేలు
-
Supreme Court: అత్యాచారం కేసు మహిళపై పెట్టొచ్చా?
-
Shalini Pandey: మళ్లీ తెలుగు సినిమాలు చేయాలని ఉంది: షాలిని పాండే
-
PAK CRICKET: ఇది వెర్రితనమే.. మ్యాచ్ ఫిక్సింగ్ చేసినవాడికి కమిటీలో చోటా?: రమీజ్ రజా
-
Social Look: ఓవర్ థింకింగ్ సీఈవో జాన్వి.. గాయాలతో కల్యాణి