ఒప్పిస్తానన్నా.. నమ్మట్లేదు
ఒకమ్మాయిని పదేళ్లుగా ప్రేమిస్తున్నా. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ మావాళ్లు ఆమెతో పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఈ విషయం తనతో చెప్పి, కొంత సమయం ఇవ్వమంటే తను నమ్మడం లేదు. నన్ను దూరం
ఒకమ్మాయిని పదేళ్లుగా ప్రేమిస్తున్నా. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ మావాళ్లు ఆమెతో పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఈ విషయం తనతో చెప్పి, కొంత సమయం ఇవ్వమంటే తను నమ్మడం లేదు. నన్ను దూరం పెడుతోంది. తనని తప్ప నేను వేరొకర్ని నా జీవితంలో ఊహించుకోలేను. ఇప్పుడు నేను ఇద్దర్నీ ఒప్పించడం ఎలా?
- నాగేంద్ర, ఈమెయిల్
మీది పదేళ్ల ప్రేమ అంటున్నారు. అంటే ఇద్దరి మధ్యా ప్రేమ, నమ్మకం ఉన్నట్లే. అయితే మీ పెద్దవాళ్లు ఎందుకు ఆమెతో పెళ్లి వద్దన్నారు? వాళ్ల పేరెంట్స్ ముందుకొచ్చి ఎందుకు మీవాళ్లని అడగలేదు? కులమతాల తేడానా? అంతస్తుల హెచ్చుతగ్గులా? పద్ధతులు, ఆచారాలు వేర్వేరా? ఈ విషయాలు ముందు ఆలోచించాలి. అసలు మీరు ఇంతవరకూ ఎందుకు పెళ్లి ప్రస్తావన తేలేదు? సరైన ఉద్యోగం లేకనా? పెద్దలతో చెప్పే ధైర్యం లేదా? పదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం అన్నారు.. అంటే ఒకర్నొకరు బాగా అర్థం చేసుకునే ఉండాలి.
మీ పెద్దవాళ్లు వద్దన్నారని చెప్పగానే తను తెలివిగా ఆలోచించింది. ప్రేమించుకోవడానికి రెండు మనసులు చాలు.. కానీ పెళ్లి కావాలి అంటే రెండు కుటుంబాల ఆమోదం కావాలి అనే విషయం తను లోతుగా ఆలోచించి ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తనని మీరు ఎందుకు ఇష్టపడుతున్నారో మీ పెద్దవాళ్లతో చెప్పండి. తను మీ జీవితంలోకి వస్తే ఎంత సంతోషంగా ఉండగలరో వివరించండి. తన రాకతో కుటుంబపరంగా ఎలాంటి ఇబ్బందులూ ఉండవని మీ కన్నవాళ్లకు భరోసా ఇవ్వండి. మరోవైపు మీరు పెద్దల్ని ఒప్పించి తన చేయి అందుకోగలననే నమ్మకం ఆ అమ్మాయిలో కలిగించండి. మీ గౌరవానికి ఎలాంటి భంగం కలిగించకుండా, మీ ఆమోదంతో ఒక్కటవ్వాలనుకుంటున్నాం.. అని ఇద్దరూ కలిసి పెద్దల్ని వేడుకోండి. తప్పకుండా వాళ్లు ఆశీర్వదిస్తారు. ఆల్ ది బెస్ట్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nalgonda: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. వ్యక్తి సజీవదహనం
-
Madhya Pradesh: మామా.. మజాకా!: కమలం గెలుపులో చౌహాన్ కీలక పాత్ర
-
Cyclone Michaung: తుపాను ప్రభావం తగ్గేవరకు అప్రమత్తంగా ఉండాలి: నెల్లూరు కలెక్టర్ ఆదేశాలు
-
Telangana Elections: చిన్న పార్టీలు.. జయాపజయాలపై పెద్ద ప్రభావం
-
Hyderabad: వారికి మస్త్ మెజారిటీ.. వీరికి బొటాబొటీ
-
Janasena: డిపాజిట్ కోల్పోయిన జనసేన అభ్యర్థులు