హద్దుల్లేని ప్రేమ!
ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్‌మహల్ కట్టించాడు.. లైలా కోసం మజ్ఞూ గుండెల్ని పిండే కవితలు రాశాడు. ఆ కాలంలో ఇవన్నీ చూసిందెవరు? కానీ తన ప్రియుడి కోసం ఒకమ్మాయి ప్రాణాలకు తెగించి, నది దాటుకుంటూ వచ్చిన అరుదైన ప్రేమకథకి మాత్రం..
ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్‌మహల్ కట్టించాడు.. లైలా కోసం మజ్ఞూ గుండెల్ని పిండే కవితలు రాశాడు. ఆ కాలంలో ఇవన్నీ చూసిందెవరు? కానీ తన ప్రియుడి కోసం ఒకమ్మాయి ప్రాణాలకు తెగించి, నది దాటుకుంటూ వచ్చిన అరుదైన ప్రేమకథకి మాత్రం.. అంతర్జాలం సాక్ష్యంగా నిలుస్తోంది. జగమంతా సలాం కొడుతోంది. ఆ అపర ప్రేమికురాలి పేరు కృష్ణ మండల్. బంగ్లాదేశ్ వాసి. తన ప్రేమను దక్కించుకున్న అదృష్టవంతుడు అభిక్ మండల్. కోల్‌కతాలో ఉంటాడు. ఇద్దర్నీ ఫేస్‌బుక్ కలిపింది. చాటింగ్‌తోనే వాళ్ల ఊసులు కలబోసుకున్నాయి. ఫోన్‌కాల్ మాటలే మనసులకు వారధి వేశాయి. ఓ శుభ ముహూర్తాన ఇద్దరూ పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్నారు. మరెలా? ఉండేది వేర్వేరు దేశాల్లో. అభిక్ ఉండే కోల్‌కతాకి వచ్చేస్తానంది కృష్ణ. మరి పాస్‌పోర్ట్, వీసా లేదాయే! అందుకే అడ్డదారుల్లో అయినా సరిహద్దులెరుగని తమ ప్రేమను కాపాడుకోవాలనుకుంది. ముందు రెండు దేశాల మధ్య ఉన్న దట్టమైన సుందర్బన్ అడవుల్లోకి ప్రవేశించింది. అది పెద్దపులులకు నిలయమైన అరణ్యం. అది దాటి బిద్యాదరి నదిలోకి దూకింది. రెండు గంటలపాటు ఈది పశ్చిమ బెంగాల్‌లో అడుగుపెట్టింది. ప్రియురాలి కోసం అభిక్ నది ఒడ్డున ఎదురు చూడసాగాడు. తర్వాత ఇద్దరూ కోల్‌కతా చేరారు. అక్కడి కాళీఘాట్ దేవాలయంలో పెళ్లి చేసుకొని దంపతులయ్యారు. ఈ తతంగం లోకమంతా పాకింది. ఆమె సాహసానికి అంతా నోరెళ్లబెట్టినా, చట్టం తన పని తాను చేసుకొని పోతుందిగా! దేశంలోకి అక్రమంగా చొరబడిందంటూ పోలీసులు కృష్ణని అరెస్టు చేశారు. ప్రేమికుడు.. తన భార్య కోసం పోరాటానికి సిద్ధమయ్యాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/11/23)
-
Nani: అందుకే వైజాగ్ నాకు ప్రత్యేకం: ‘హాయ్ నాన్న’ ఈవెంట్లో నాని
-
హైదరాబాద్ ఓటర్ల కోసం ‘పోల్ క్యూ రూట్’ పోర్టల్
-
Minerals Auction: ₹45 వేల కోట్ల విలువైన ఖనిజ బ్లాకులకు ఈ-వేలం షురూ
-
Ts election: దేవుడి తోడు ఆ గుర్తుకే ఓటేస్తా.. రూ.వెయ్యి తీసుకుని ఓటర్ల ప్రమాణం
-
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్