చాట్ చేస్తూ... ఫ్రెండ్లీగానే అంటోంది
మనలో మనం
నాకు పెళ్లై ఇరవై నెలలు అవుతోంది. మాకు ఒక పాప. నా భార్యను బాగానే చూసుకుంటాను. తను కొన్నాళ్లుగా ఒకరితో వాట్సప్ చాటింగ్ చేస్తోంది. ఒకరోజు గట్టిగా నిలదీస్తే ‘తను నా పాత బాయ్‌ఫ్రెండ్.. ఇప్పుడు జస్ట్ ఫ్రెండ్లీగానే మాట్లాడుతున్నా’ అంది. అప్పట్నుంచి మామధ్య గొడవలు మొదలయ్యాయి. పదోతరగతిలో ఉన్నప్పుడు తనని ఇద్దరు రేప్ చేసినట్టు మరో భయంకరమైన విషయం చెప్పింది. అది విన్నప్పట్నుంచి భరించలేనంత బాధగా ఉంది. తనను వదల్లేను.. భర్తగా ఉండలేను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపించండి.
- ఓ పాఠకుడు, ఈమెయిల్
మీది నిజంగా బాధాకరమైన పరిస్థితే. అలా బాధ పడుతూ కూర్చోకుండా సమస్యకు పరిష్కారం ఏంటో ఒక్కసారి ఆలోచించండి. పదోతరగతి చదువుకునే రోజుల్లో ఆమె మీద ఎవరో పశువులు చేసిన అఘాయిత్యానికి ఆమె బాధ్యురాలు కాదు. ఈ విషయంలో ఆమెను సానుభూతితో అర్థం చేసుకుని, జాలి చూపించవచ్చు. అయితే పెళ్లికి ముందు చెప్పని ఈ విషయాన్ని ఇప్పుడు మీతో ఎందుకు చెప్పింది? బహుశా మీమీద నమ్మకంతో, మీరు అండగా నిలుస్తారనే భరోసాతో కావచ్చు. తన ప్రమేయం, తప్పు లేని ఈ విషయంలో ఆమెను పెద్ద మనసుతో క్షమించవచ్చు. ఇది సలహా ఇచ్చినంత తేలిక కాకపోయినా అంతకుమించి మరో మార్గం లేదు. అయితే ఇప్పుడు కూడా ఆ అమ్మాయి మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో చాటింగ్ చేయడం హర్షించదగ్గ విషయం కాదు. అదే విషయం స్పష్టంగా, గట్టిగా చెప్పండి. తనలా చేయడం వల్ల ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో వివరించండి. జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండాల్సింది భార్యాభర్తలే. మూడో వ్యక్తి కారణంగా ఇద్దరి మధ్యా కలతలు రావడం అంత మంచిది కాదనే విషయం తెలియజేయండి. తప్పకుండా అర్థం చేసుకుంటుంది. అయినా పద్ధతి మార్చుకోకుంటే ఇరువైపులా పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడండి. చివరగా మీరు తీసుకోబోయే నిర్ణయం అభం శుభం తెలియని మీ కూతురు భవిష్యత్తుపై ప్రతికూలంగా ఉండొద్దనే ఆలోచన మనసులో పెట్టుకోండి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Cyber Crime : ఇంట్లో కూర్చోబెట్టే కాజేత
-
World News
Saudi Arabia: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది హజ్ యాత్రికుల మృతి
-
Politics News
Vangalapudi Anitha: 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: అనిత
-
Politics News
Raghurama: నాడు తెదేపాలో లక్ష్మీపార్వతిలాగా నేడు వైకాపాలో సజ్జల వ్యవహరిస్తున్నారు
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు
-
World News
ఉనికికే ముప్పొస్తే ఎవరినైనా లేపేస్తాం: అమెరికాకు రష్యా తాజా హెచ్చరిక