అతి ప్రేమతో చంపేస్తోంది
నా గాళ్‌ఫ్రెండ్ చిన్నచిన్న విషయాలకే అతిగా స్పందిస్తుంది. నేను వేరే అమ్మాయిలతో మాట్లాడితే తనకి నచ్చదు. పుట్టినరోజు, వేలంటైన్స్ డే.. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో తప్పనిసరిగా తనకి శుభాకాంక్షలు చెప్పాలి. ఎక్కడికెళ్తున్నా తెలియజేయాలి. గుడ్‌మార్నింగ్, గుడ్‌నైట్‌లు మర్చిపోయినా గోల చేస్తుంది. అలాగే కోపంతో
నా గాళ్‌ఫ్రెండ్ చిన్నచిన్న విషయాలకే అతిగా స్పందిస్తుంది. నేను వేరే అమ్మాయిలతో మాట్లాడితే తనకి నచ్చదు. పుట్టినరోజు, వేలంటైన్స్ డే.. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో తప్పనిసరిగా తనకి శుభాకాంక్షలు చెప్పాలి. ఎక్కడికెళ్తున్నా తెలియజేయాలి. గుడ్‌మార్నింగ్, గుడ్‌నైట్‌లు మర్చిపోయినా గోల చేస్తుంది. అలాగే కోపంతో ఒకట్రెండుసార్లు నాతో మాట్లాడటం మానేసింది. ‘బ్రేకప్’ అంది. సరే అని నేనూ పట్టించుకోవడం మానేస్తే వదలదు. నేనే వెళ్లి బతిమాలి ‘సారీ’ చెప్పాలి. మిగతా సమయాల్లో నాపై విపరీతమైన ఇష్టం చూపిస్తుంది. అడక్కముందే అవసరాలు తీర్చుతుంది. అమ్మలా లాలిస్తుంది. కానీ ఆమె అతినే నేను తట్టుకోలేకపోతున్నా.
- వంశీ, ఈమెయిల్
మీ లేఖ చదివాను. తను అతిగా స్పందించడం చూస్తుంటే మీపట్ల ఓవర్ పొజెసివ్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటివాళ్లలో తనకే సొంతమైన వస్తువు, వ్యక్తిని ఇతరులు సొంతం చేసుకుంటారనే భయం ఉంటుంది. దాంతో అలా ప్రవర్తిస్తారు. సహజంగానే ఆడ పిల్లలు తాము ఇష్టపడేవాళ్లు ఎక్కువ ప్రేమ చూపించాలని కోరుకుంటారు. ఇక ఆమె చిన్నచిన్న విషయాలకే గొడవ చేయడం ఒకరకమైన మానసిక ఆందోళన, ఆతృతని సూచిస్తుంది. దీనికి కౌన్సెలింగ్ తీసుకుంటే సరిపోతుంది. మీకోసం ఎన్నో చేస్తుంది అంటున్నారు. అలాంటప్పుడు తనకి ప్రతి సందర్భంలో శుభాకాంక్షలు చెప్పడం పెద్ద కష్టమేం కాదు. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్‌లు చెప్పడం మీవల్ల కాకపోతే.. ఎందుకు కుదరడం లేదో.. తనకి విడమరచి చెప్పండి. అవసరం, స్నేహం.. కారణం ఏదైనా ఈరోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు మాట్లాడుకోవడం సహజం. మీరు ఏ కారణంతో వేరే అమ్మాయిలతో మాట్లాడాల్సి వస్తుందో వివరించండి. మీ తొలి ప్రాధాన్యం ఆమెకే అని అర్థమయ్యేలా చెప్పండి.
కొన్నిసార్లు మనల్ని మనం కూడా విశ్లేషించుకోవాలి. ఆ అమ్మాయి వేరే అబ్బాయిలతో మాట్లాడితే మీరెలా ఫీలవుతారు? మీ పుట్టినరోజున ఆమె విష్ చేయడం మర్చిపోతే ఏం చేస్తారు? ఆమె స్థానంలో ఉండి ఆలోచించండి. అప్పుడు తప్పకుండా తనకి ప్రాధాన్యం ఇస్తారు. బయటికి వెళ్లినప్పుడు మనం ఇంట్లో చెప్పి వెళ్లడం సహజం. దాన్ని అతి అనుకోవద్దు. ఎక్కడికి వెళ్తున్నారు? ఏ సమయానికి వస్తారు? చెబితే వాళ్లు కంగారు పడకుండా ఉంటారు కదా! మొత్తమ్మీద తను మీ నుంచి అతి ప్రేమ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది పెద్ద తప్పేం కాదు.. కానీ దీనివల్ల మీరెలా ఇబ్బంది పడుతున్నారో వివరించి చెప్పండి. మారడానికి ఆమెకి కొంచెం సమయం ఇవ్వండి. ఈ సమస్య తగ్గితే మీ జంట అన్యోన్యంగా ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వ మద్యంలో రంగునీళ్లు కలిపి విక్రయం.. రాజమహేంద్రవరంలో ఘటన
-
Special Trains: 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు
-
Hyderabad: హోటళ్లు తెరచుకోక ఇక్కట్లు
-
JEE Mains: జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు
-
ప్రియుడి సూచనతో.. లేడీస్ హాస్టల్ టాయిలెట్లో రహస్య కెమెరా!
-
శ్రీనగర్ నిట్‌లో సోషల్ మీడియా దుమారం