బాయ్‌ఫ్రెండ్ తీరు.. మారేదెలా?
ఉద్యోగం, స్వభావరీత్యా నాకు చాలామంది స్నేహితులున్నారు. వాళ్లలో అబ్బాయిలే ఎక్కువ. వాళ్లతో మాట్లాడటం నా బాయ్‌ఫ్రెండ్‌కి నచ్చడం లేదు. అర్ధరాత్రుళ్లూ మాట్లాడుతున్నానని గొడవ పడుతున్నాడు.
మనలో మనం
ఉద్యోగం, స్వభావరీత్యా నాకు చాలామంది స్నేహితులున్నారు. వాళ్లలో అబ్బాయిలే ఎక్కువ. వాళ్లతో మాట్లాడటం నా బాయ్‌ఫ్రెండ్‌కి నచ్చడం లేదు. అర్ధరాత్రుళ్లూ మాట్లాడుతున్నానని గొడవ పడుతున్నాడు. ఒకమ్మాయి ప్రేమించినవాడితో తప్ప ఇంకెవరితో కలుపుగోలుగా ఉండకూడదా? ఇన్నేళ్ల మన ప్రేమ మీద నమ్మకం లేదా? అని ఓసారంటే.. ‘నువ్వు వాళ్లతో రిలేషన్‌లో లేవని గ్యారెంటీ ఏంటి?’ అన్నాడు. తనంటే నాకు చాలా ఇష్టమేగానీ అలా అనుమానించడంతో చాలా డిప్రెషన్‌కి గురవుతున్నా. నా సమస్యకి పరిష్కారమేంటి?
ఎస్.ఆర్.డి, ఈమెయిల్
ఒకమ్మాయి ప్రేమించిన అబ్బాయితోనే కాకుండా వేరొకరితో మాట్లాడటం తప్పేమీ కాదు. కానీ ఎంతసేపు, ఏ సమయంలో, ఏం మాట్లాడుతున్నాం? అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అసలు మీరు ఆ ఫ్రెండ్స్‌తో ఏం మాట్లాడుతున్నారు.. ఎందుకు మాట్లాడుతున్నారో.. మీరు ప్రేమించిన వ్యక్తికి ఒక్కసారైనా అర్థమయ్యేలా చెప్పారా? నేటి సమాజంలో ఆడామగా అనే తేడాలేం లేవు.. ఇద్దరూ సమానమే.. కానీ మన జీవిత భాగస్వామి ఇష్టాయిష్టాలను పరిగణలోకి తీసుకోవడం.. వాళ్ల మనసు నొప్పించకుండా ఉండటమూ ముఖ్యమే. అందులోనూ తను మీరు ప్రేమిస్తున్న వ్యక్తి అంటున్నారు.. అతడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు తన ఇష్టాలను గౌరవించాలి. అప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది. ఉద్యోగరీత్యా తప్పనిసరై మాట్లాడుతుంటే అదే విషయం చెప్పండి. లేదా.. సరదాగా, ఫ్రెండ్లీగా కబుర్లు చెప్పుకుంటుంటే.. వాటిని వీలైనంతవరకు తగ్గించుకోవడమే ఉత్తమం. మీ ఇద్దరి వయసు, నేపథ్యం తెలపలేదు. ఎన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు? మీది దీర్ఘకాలం ప్రేమ అయితే ఇప్పటికే ఒకర్నొకరు పూర్తిగా అర్థం చేసుకొని ఉంటారు. కానీ మీ విషయంలో అది కనబడటం లేదు. ప్రేమ అనేది ఒక ఎమోషన్ మాత్రమే కాదు. ఒక నమ్మకం, బాధ్యత. ఇద్దరి మధ్య అర్థం చేసుకునే గుణం ఉన్నప్పుడే ఆ బంధం బలపడుతుంది. వాళ్లతో రిలేషన్‌షిప్‌లో లేవనే గ్యారెంటీ ఏంటి? అని అనుమానిస్తున్నాడంటే.. మీ బంధం దృఢంగా లేదనే అర్థం. తనది మాటిమాటికీ అనుమానించే మనస్తత్వం అయితే జీవితాంతం బాధ పడే బదులు ఆ బంధాన్ని వదులుకోవడమే మంచిది. అతడిని ప్రేమిస్తున్నాను.. తనే కావాలి అనుకుంటే.. మీరైనా మారాలి. అతడి అపోహల్ని అయినా తొలగించాలి. భారతీయ సంస్కృతిలో భార్యాభర్తల మధ్య పొసెసివ్‌నెస్ ఎక్కువ. మీరు తనకే సొంతం అనే భావనలో ఉన్నాడు. అతడి స్థానంలో మీరే ఉంటే ఎలా స్పందిస్తారో ఒక్కసారి ఊహించుకోండి. మీ అనుబంధం శాశ్వతంగా ఉండటం కోసం స్నేహాల్ని తగ్గించుకున్నా ఫర్వాలేదు. పై వాటిన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఓ చక్కటి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ.. ఆల్ ది బెస్ట్!
అర్చన నండూరి, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ODI WC 2023: అశ్విన్ ఎంపికపై భజ్జీ కామెంట్లు.. నెట్టింట మరోసారి సంజూ వైరల్!
-
Lalu Prasad Yadav: భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట
-
Supreme Court: ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
CISF constable: దిల్లీలో చీపురుపల్లి కానిస్టేబుల్ ఆత్మహత్య
-
Galaxy S23 FE: శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ విడుదల.. 50MP కెమెరా, 4,500 బ్యాటరీ
-
China: సముద్ర ఉచ్చులో చైనా అణు జలాంతర్గామి.. 55 మంది సబ్‌మెరైనర్ల మృతి..!