నాతో నిశ్చితార్థం..వేరే అమ్మాయితో ప్రేమ!
హలో శృతి, మీ పరిస్థితి నిజంగా చాలా బాధాకరం. ఈ సమయంలో ఎమోషనల్‌గా కాకుండా ప్రాక్టికల్‌గా ఆలోచించడం ముఖ్యం. మీతో పెళ్లి ఇష్టం లేకపోయినా, తను మీతో సమయం గడపడం
మనలో మనం
రెండునెలల కిందట ఒకబ్బాయితో నిశ్చితార్థమైంది. ఇంకో రెండు నెలల్లో పెళ్లి. బాగా మాట్లాడుకునేవాళ్లం. కలిసి సినిమాలకూ వెళ్లాం. తన మాటతీరు, పద్ధతి అంతా బాగానే ఉంది. కానీ సడెన్‌గా ఇప్పుడు ‘నేను వేరే అమ్మాయిని ప్రేమించా. పెద్దవాళ్లని కాదనలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నా. అబ్బాయి నచ్చలేదని నువ్వే చెప్పాలి’ అని బతిమాలుతున్నాడు. ఇంతదూరం వచ్చాక నేనేం చేయలేనంటే.. ‘పెళ్లైతే సంతోషంగా ఉండలేం.. ఇద్దరి జీవితాలూ నాశనం అవుతాయి’ అంటున్నాడు. అయోమయంగా ఉంది. నేనేం చేయాలి?
శృతి, ఈమెయిల్
హలో శృతి, మీ పరిస్థితి నిజంగా చాలా బాధాకరం. ఈ సమయంలో ఎమోషనల్‌గా కాకుండా ప్రాక్టికల్‌గా ఆలోచించడం ముఖ్యం. మీతో పెళ్లి ఇష్టం లేకపోయినా, తను మీతో సమయం గడపడం.. సినిమాలకు రావడం ఎందుకు చేశాడో ఎప్పుడైనా అడిగారా? పెళ్లి చేసుకోలేను అనుకున్నవాడు నిశ్చితార్థం చేసుకోవడం.. మీతో బాగానే ఉండి ఆశ కల్పించడం.. ఇవన్నీ అతడి తప్పులే. ఇప్పుడు జరగాల్సిన విషయానికొస్తే.. అతడు వేరే అమ్మాయిని ప్రేమించాను అని చెప్పిన విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. పెళ్లి చేస్తే వాళ్లే సర్దుకుపోతారు, కలిసి ఉంటారు అని చాలామంది పెద్దలు భావిస్తుంటారు. కానీ అందరి విషయాల్లో ఇది సాధ్యం కాదు. పెళ్లి అంటే నూరేళ్ల బంధం. అది కలకాలం నిలవాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం, ఇష్టం ఉండాలి. పెళ్లాడబోయే వ్యక్తి ఇష్టపడి చేసుకుంటేనే కాపురం సజావుగా సాగుతుంది. అలాంటిది.. తను పెళ్లే ఇష్టం లేదన్నప్పుడు ఇంకా ఆ బంధంలో కొనసాగాలనుకోవడం సరికాదు. నిశ్చితార్థం అయ్యాక తనలా చెప్పడం.. బాధాకరమే కానీ పెళ్లయ్యాక చెబితే మరింత ఇబ్బందికర పరిస్థితి తలెత్తేది.
ఇంత జరిగాక ఆ అబ్బాయి కోరినట్టు చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఉన్నది ఉన్నట్టుగానే మీ అమ్మా నాన్నలతో చెప్పండి. తను చేసిన తప్పునకు మీరు ఒకరితో మాట పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీవాళ్లు మిమ్మల్ని ఒప్పించాలని ప్రయత్నించినా ఖరాఖండీగా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోనని చెప్పేయండి. ఇవేం పట్టించుకోకుండా మీ కన్నవాళ్లు పరువు అని పాకులాడితే.. వాళ్లని ఫ్యామిలీ కౌన్సెలర్ దగ్గరికి తీసుకెళ్లండి తప్ప మీపై ఎలాంటి నింద వేసుకోవద్దు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/10/2023)
-
Rahul Gandhi: నేను చెప్పింది మోదీ అంగీకరించారు: రాహుల్ గాంధీ
-
TMC: మా ఎంపీలు, మంత్రులపై దిల్లీ పోలీసులు చేయి చేసుకున్నారు: తృణమూల్ కాంగ్రెస్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!