ప్రకృతి ప్రేమికులు ఒక్కటయ్యారు

ఈ పెళ్లిలో బాజాభజంత్రీలు లేవు. భారీఎత్తున అలంకరణలు అంతకన్నా ల్లేవు. అయితేనేం.. అతిథులందరూ వధూవరులను ఆశీర్వదించడమే కాకుండా, వారి ఆశయానికి చేయూతనిచ్చి మరీ వెళ్లారు. పుదుచ్చేరికి చెందిన సింధు, భారతిలు ప్రకృతి ప్రేమికులు.....

Updated : 16 Sep 2022 12:34 IST

ఈ పెళ్లిలో బాజాభజంత్రీలు లేవు. భారీఎత్తున అలంకరణలు అంతకన్నా ల్లేవు. అయితేనేం.. అతిథులందరూ వధూవరులను ఆశీర్వదించడమే కాకుండా, వారి ఆశయానికి చేయూతనిచ్చి మరీ వెళ్లారు. పుదుచ్చేరికి చెందిన సింధు, భారతిలు ప్రకృతి ప్రేమికులు. దీంతో తమ వివాహాన్ని ప్రకృతి పర్యావరణ అనుకూల వేదికగా మార్చారు. తమ వివాహభోజనాన్ని అతిథులు మరవకుండా ఉండేలా, అలాగే వాటి ద్వారా ఆరోగ్యంపట్ల అవగాహన అందించాలనుకున్నారు.
* ఆహ్వానమెలా: కాగితపు వినియోగాన్ని తగ్గిస్తూ, ఆన్‌లైన్‌లోనే పంపించారు.
* విరాళం కోరారిలా:  మీరందించే కానుకల కన్నా, మా వివాహానికి మీ రాక, అలాగే మీ ఆశీస్సులు ముఖ్యం. అయితే మీ కానుకను కూడా ఆశిస్తున్నాం. విరాళం రూపంలో ‘ఫారెస్ట్‌ ఫస్ట్‌ సమితి.ఆర్‌’్గ అనే సేవా సంస్థకు అందించవలసిందిగా కోరుతున్నాం.  దక్షిణభారతదేశంలో అడవుల అభివృద్ధి కోసం లక్షలాది మొక్కలను నాటుతూ, పర్యావరణాన్ని కాపాడుతున్న ఆ సంస్థతో మనందరం చేయి కలుపుదాం.


* వేదికనెలా అలంకరించారు: ప్లాస్టిక్‌, రంగుల కాగితాల అలంకరణ కాకుండా, సహజసిద్ధమైన పూలతో తీర్చిదిద్దారు.
* విస్తరిలో ఏం వడ్డించారు: ఆర్గానిక్‌ ఆహారపదార్థాల పట్ల అవగాహన కలిగించే దిశగా సేంద్రియ పదార్థాలకు ప్రాముఖ్యతనిచ్చారు. పాలిష్‌ చేసిన బియ్యం, మైదా, చక్కెర, రిఫైన్డ్‌ సాల్ట్‌ లేకుండా, సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు, పప్పులు సహా పలురకాల మిల్లెట్స్‌తో కూడిన వంటకాలనే వడ్డించారు.
* ఎందులో వడ్డించారు:  ఆకులు, నారతో తయారుచేసిన పళ్లాలు, గ్లాసులు సహా అరటి ఆకుల్లో వడ్డించారు.
* తాంబూలాలు: ఓ ఎన్జీవో సహకారంతో తయారైన ఈకో ఫ్రెండ్లీ బ్యాగుల్లోనే తాంబూలాలిచ్చారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని