పంచుకుందాం

నావన్నీ ‘వాల్‌’ముచ్చట్లే.. తనపై నా ప్రేమెంతంటే.. పోగేయలేనన్ని నా లైక్‌లంత! నేను పంచుకున్న ఊసులెన్నంటే.. దాచుకోలేనన్ని ఎమోజీలంత!

Updated : 02 May 2020 00:22 IST

సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌

నావన్నీ ‘వాల్‌’ముచ్చట్లే..

తనపై నా ప్రేమెంతంటే..

పోగేయలేనన్ని నా లైక్‌లంత!

నేను పంచుకున్న ఊసులెన్నంటే..

దాచుకోలేనన్ని ఎమోజీలంత!

ప్రేమలో నా కమిట్మెంట్‌ ఎంతంటే..

కల్మషంలేని నా కామెంట్‌లంత!

- ఎన్‌.జీ


బ్రేక్‌అప్‌ అంటే మర్చిపోవడమో.. మరో జీవితాన్ని ప్రారంభించడమో కాదు.. గుండె పగలడం.. దాంట్లోని జ్ఞాపకాలనే పెంకుల్ని జీవితాంతం ఏరుకోవడం..

- వినయ్‌


జరసోచో!

దేశసరిహద్దుల్లోకి వెళ్లి యుద్ధం చేయమనడం లేదు. మీ ఇంటి సరిహద్దుల్లోనే ఆగిపోమంటున్నాం!

- స్వాతి యిందుకూరి


క్లిక్‌తో రేడియో!

మీకు రేడియో వినడం అలవాటా! ఖాళీ సమయాల్లో నచ్చిన స్టేషన్‌ పెట్టేసి రేడియో వినేస్తారా? లాక్‌డౌన్‌లో ఎలాగూ వర్క్‌ ఫ్రం హోమ్‌ అంటూ ఇళ్లకే పరిమితమయ్యారు కదా! కంప్యూటర్‌లో మీ పని చేసుకుంటూనే మీకు నచ్చిన ఎఫ్‌ఎం వినాలంటే? అందుకే ఈ వెబ్‌సైట్‌ పేరు OnlineRadioFM.in దీన్ని తెరిస్తే చాలు. దేశంలోని అనేక రేడియో స్టేషన్లు దర్శనమిస్తాయి. నచ్చింది క్లిక్‌ చేసి వినేయొచ్ఛు ప్రయత్నించండి.

- విశాల్‌, నెల్లూరు


ఇంట్లోనే నేర్చుకుందాం!

లాక్‌డౌన్‌తో స్కూల్స్‌, కాలేజీలన్ని మూతపడ్డాయి. మరి ఇంట్లో ఖాళీగా కూర్చుంటూ సమయం వృథా చేస్తున్నారా! అయితే ఈ యాప్‌ని మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోండి. పేరు Socratic by Google. ఇదొక లెర్నింగ్‌ యాప్‌. మ్యాథ్స్‌, బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, హిస్టరీ, లిటరేచర్‌ వంటి చాలా సబ్జెక్టులను నేర్చుకోవచ్ఛు ఏదైనా సమస్యను పేపర్‌పై రాసి స్కాన్‌ చేస్తే చాలు పూర్తి వివరణ ఇస్తుంది. అంతేకాదు వాయిస్‌ రూపంలో ప్రశ్నలు అడిగినా సమాధానం తెలుసుకోవచ్ఛు వీడియోల రూపంలోనూ చూపుతుంది.

- శ్రీను, కరీంనగర్‌



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని