అలా మస్కా కొట్టేశాడు!

డెబ్భైశాతం హాజరు దాటితేనే సెమిస్టర్‌ పరీక్షలకు అనుమతించడం మా కాలేజీ సంప్రదాయం....

Published : 31 Oct 2020 00:51 IST

కాలేజీ డైరీ

డెబ్భైశాతం హాజరు దాటితేనే సెమిస్టర్‌ పరీక్షలకు అనుమతించడం మా కాలేజీ సంప్రదాయం. కాలేజ్‌ క్లబ్‌ ఈవెంట్స్‌లో పాల్గొంటే, కల్చరల్‌ యాక్టివిటీస్‌లో చురుగ్గా ఉంటే దీనికి మినహాయింపు ఇస్తారు.  ఇవేమీ లేకపోతే కచ్చితంగా డాక్టరు నుంచి మెడికల్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాల్సి ఉంటుంది. నా ఫ్రెండ్‌ సుజిత్‌ క్లాసులకు హాజరైంది తక్కువ. సెమిస్టర్‌ పరీక్షలు రాయాలంటే సర్టిఫికెట్‌ తీసుకు రమ్మన్నారు మా హెచ్‌వోడీ. మావాడు ఏదోలా కష్టపడి డాక్టరు ఇచ్చిన పత్రం తీసుకొచ్చాడు. పరీక్షలకు హాల్‌ టికెట్‌ ఇచ్చారు. రెండు ఎగ్జామ్స్‌ రాశాక సుజిత్‌ ఆ ధ్రువీకరణ పత్రం కాపీ మాకు చూపించాడు. ఇంతకీ తనకి ఆరోగ్యం బాగా లేదని ఎవరితో సర్టిఫికెట్‌ తీసుకొచ్చాడో తెలుసా? ఒక గైనకాలజిస్టుతో. ఇంక వేరే చెప్పాలా? మేం పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నామని.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని