క్లాసులో లేవుగా..

మా లెక్చరర్‌ ఓరోజు ‘రేపు ఆటోక్యాడ్‌ డ్రాయింగ్స్‌ వేసి తీసుకురండి’ అన్నారు. దీని ఆధారంగానే ఇంటర్నల్‌ మార్కులు వేస్తానని చెప్పారు. మర్నాడు అందరితోపాటు నన్నూ అడిగారు. ‘తీసుకొచ్చాను..

Published : 21 Nov 2020 00:42 IST

కాలేజీ డైరీ

మా లెక్చరర్‌ ఓరోజు ‘రేపు ఆటోక్యాడ్‌ డ్రాయింగ్స్‌ వేసి తీసుకురండి’ అన్నారు. దీని ఆధారంగానే ఇంటర్నల్‌ మార్కులు వేస్తానని చెప్పారు. మర్నాడు అందరితోపాటు నన్నూ అడిగారు. ‘తీసుకొచ్చాను.. చూపిస్తాను సర్‌’ అని ధీమాగా చెప్పాను. నిజానికి నేను ఏ డ్రాయింగూ వేయలేదు. ఆయన మరీ అంత గట్టిగా అడగరు అనే తేలికభావంతో ఉన్నాను. మళ్లీ అడిగితే ‘కాసేపు ఆగండి సర్‌. నా ల్యాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి డ్రాయింగ్స్‌ చూపిస్తాను’ అన్నాను గంభీరంగా. సర్‌ అక్కడి నుంచి కదలేదు. నాలో గుబులు మొదలైంది. ‘నాకు తెలుసు.. నువ్వు వర్క్‌ చేయలేదని. ఎందుకంటే ఆ సాఫ్ట్‌వేర్‌ గురించి నిన్న పాఠం చెబుతున్నప్పుడు నువ్వు క్లాసులో లేవు. అంతేగా’ అన్నారు. పది నిమిషాలు గడిచినా నేనేమీ చూపించలేక తత్తరపాటుకి గురయ్యా. ముందు నిశ్శబ్దంగా.. తర్వాత నవ్వులతో నిండిపోయింది క్లాసంతా. నాకు నామోషీ అనిపించి పట్టుబట్టి ఆ రాత్రంతా డ్రాయింగ్స్‌ వేసి మర్నాడు సర్‌కి చూపించాను.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని