క్లాస్‌రూంలో తపస్సు..

డిగ్రీలో జరిగిందీ సరదా సంఘటన. అప్పట్లో నేను, మా ఆయన శ్రీ క్లాస్‌మేట్స్‌. తను మెరిట్‌ విద్యార్థి. లోతైన సందేహాలతో లెక్చరర్లను ఇరుకున పెట్టేవాడు. దాంతోపాటు అల్లరి కూడా ఎక్కువే. ఫైనలియర్‌లో ఉన్నప్పుడు ఒక లెక్చరర్‌ సెమినార్‌ నిర్వహిస్తున్నారు

Published : 05 Dec 2020 00:58 IST

కాలేజీ డైరీ

డిగ్రీలో జరిగిందీ సరదా సంఘటన. అప్పట్లో నేను, మా ఆయన శ్రీ క్లాస్‌మేట్స్‌. తను మెరిట్‌ విద్యార్థి. లోతైన సందేహాలతో లెక్చరర్లను ఇరుకున పెట్టేవాడు. దాంతోపాటు అల్లరి కూడా ఎక్కువే. ఫైనలియర్‌లో ఉన్నప్పుడు ఒక లెక్చరర్‌ సెమినార్‌ నిర్వహిస్తున్నారు. ఇంతకుముందే ఆ సబ్జెక్టు అంతా బట్టీ పట్టేశాడు శ్రీ. మళ్లీ వినడం ఇష్టంలేక వెనక బెంచిలో వెళ్లి కూర్చొని ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకొని సెల్‌ఫోన్‌లో పాటలు వింటున్నాడు. సర్‌ మాట్లాడటం ఆపి సరిగ్గా మావైపు చూస్తున్న సమయంలోనే ఇయర్‌ఫోన్స్‌ ఊడిపోయి పెద్దశబ్దంతో పాట బయటికి వినబడటంతో క్లాసంతా అటువైపు చూడటం మొదలుపెట్టారు. ఇంతకీ ఆ పాట ఏంటో తెలుసా? ‘క్లాసురూములో తపస్సు చేయుట వేస్టురా గురూ’ సాంగ్‌. తర్వాత మా లెక్చరర్‌ ఫోన్‌తో సహా మా ఆయనను స్టాఫ్‌రూంకి పిలిపించుకొని అక్కడ ఒక లెక్చర్‌ ఇచ్చారు. వాళ్లు అటు వెళ్లగానే మా క్లాసంతా నవ్వులతో నిండిపోయింది.

- అనూ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని