ఇంట్లోనే.. కాలేజీ పండగ

పాటలు.. ఫన్నీ కార్యక్రమాలు.. వినోదాలు.. వీడుకోలు.. కుదిరితే ఐలవ్యూలు కాలేజీ వార్షికోత్సవం అంటే ఆ హంగామానే వేరు. ఇది అందరికీ ఇష్టమే.

Published : 02 Jan 2021 00:57 IST

కొత్త ట్రెండ్‌

పాటలు.. ఫన్నీ కార్యక్రమాలు.. వినోదాలు.. వీడుకోలు.. కుదిరితే ఐలవ్యూలు కాలేజీ వార్షికోత్సవం అంటే ఆ హంగామానే వేరు. ఇది అందరికీ ఇష్టమే. కానీ కొవిడ్‌ పుణ్యమాని ప్రపంచవ్యాప్తంగా ఈ సరదాలకి ఫుల్‌స్టాప్‌ పడింది. హంగూ, ఆర్భాటం ఆగిపోయాయి. తమ విద్యార్థులు నిరుత్సాహానికి గురి కావొద్దని అమెరికాలోని మిన్నెసొటా స్టేట్‌ యూనివర్సిటీలోని సైకాలజీ విభాగం ఆలోచించింది. యాన్యువల్‌ డే నాడు.. ఆన్‌లైన్‌లో వేడుకలు నిర్వహించి వాళ్లలో మరింత జోష్‌ నింపేలా వాళ్ల ఇంటికి చాక్లెట్లు, పుస్తకాలు, టీషర్టులు, కేక్‌లు, చిన్నచిన్న బహుమతుల్లాంటివి పంపించింది. వీటితోపాటు రంగురంగుల కాగితాలతో కూడిన చిన్న సంచీని అందించారు. గ్రాడ్యుయేషన్‌ రోజుని ఎవరికి వారే సందడిగా జరుపుకోవాలని సూచించారు. అసలే.. ఊపు మీదుండే కుర్రకారు ఆగుతారా? పెద్దఎత్తున హంగామా చేసేసి ఆ సంబరాల్ని ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌, ఫేస్‌బుక్‌లలో పెట్టేశారు. ఇది కాస్తా వైరల్‌ కావడంతో మాకూ ఇలాంటి ట్రెండ్‌ కావాలంటున్నారు యూత్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని