చీరోచిత విన్యాసాలు
చీర కడితే ఒయ్యారంగా నడవాలి. ఎప్పటికప్పుడు సవరించుకుంటూ జాగ్రత్త పడాలి. కానీ హరియాణా అమ్మాయి పరుల్ అరోరా ఉంది చూశారూ! చీరతోనే అమాంతం గాల్లో పల్టీలు కొడుతుంది. విన్యాసాలతో కళ్లార్పకుండా చేస్తుంది. ఈ సాహసాలతోనే తనిప్పుడు ఆన్‌లైన్ సంచలనంగా మారింది. పరుల్ ఓ జిమ్నాస్ట్. సాధారణంగా జిమ్నాస్ట్‌లు ట్రాక్‌లోకి దిగేముందు సౌకర్యంగా ఉండేందుకు ఒంటికి అతుక్కుపోయే ట్రాక్ దుస్తులు ధరిస్తారు. కానీ దీనికి భిన్నంగా.. నిపుణుల మాటల్లో చెప్పాలంటే పరుల్ ప్రమాదకర విన్యాసాలు చేస్తోంది. అలాగని తను ఆషామాషీ అమ్మాయేం కాదు. జాతీయస్థాయిలో పదుల సంఖ్యలో బంగారు పతకాలు గెల్చుకున్న జిమ్నాస్ట్. ప్రస్తుతం చీర కట్టి.. ఫ్రంట్ ప్లిప్, బ్యాక్‌ఫ్లిప్, కార్ట్‌వీల్స్ విన్యాసాలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ‘చీరతో ప్రమాదకరమైన విన్యాసాలు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండింగ్‌లో ఉంటోంది. ‘మగువకి మరింత అందం తెచ్చే చీర అంటే నాకెంతో ఇష్టం. అలాగే నాకు ఇంత గుర్తింపు తీసుకొచ్చిన జిమ్నాస్టిక్స్ అన్నా. ఈ రెండింటిపై మమకారం చాటుకోవడానికే ఇలా చేస్తోన్నా’ అంటోంది తను. ఈ వీడియో, ఫొటోల్ని లక్షలమంది వీక్షించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TS Govt: ఆ తీర్పు అమలును రెండు వారాలు నిలిపివేయండి: హైకోర్టును కోరిన తెలంగాణ ప్రభుత్వం
-
Movies News
Tamil movies: ఈ ఏడాది ఆసక్తి రేకెత్తిస్తోన్న కోలీవుడ్ చిత్రాలివీ!
-
Sports News
Ashwin: పాక్ క్రికెట్ బోర్డు వ్యాఖ్యలకు అశ్విన్ ఘాటు స్పందన!
-
India News
SC: న్యాయమూర్తిగా ఎల్సీవీ గౌరీ నియామకం సరైందే.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
-
World News
EarthQuake: నిన్నటి నుంచి 100 సార్లు కంపించిన భూమి..!
-
Crime News
Hyderabad: భార్య చూస్తుండగానే భవనం పైనుంచి దూకేసిన భర్త