ఫిట్‌నెస్ మంత్ర
బలమైన చేతులకు
చేతుల్లో చేవ ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. కండలు కనిపించేలా చొక్కాలు వేసుకొని పోజులు కొడతాం. మరి బలమైన హస్తాలు కావాలంటే తేలికైన వ్యాయామాలేంటో తెలుసుకోవాలిగా!
పులప్స్
అప్పర్ బాడీ దృఢం కావడానికి నెంబర్ వన్ వ్యాయామం. రెండు చేతులతో బార్‌ని పట్టుకొని, శరీరాన్ని నిటారుగా ఉంచి భారమంతా చేతులపై పడేలా కిందికీపైకీ ఊగాలి. భుజాలు, మణికట్టు బలంగా తయారవుతుంది.
పుషప్స్
చేతులని బలంగా చేస్తాయి. బైసెప్, ట్రైసెప్‌లకూ మంచి వ్యాయామం. ప్లాంక్ పొజిషన్‌లో ఉంచి, నేలపై చేతులను ఆనించి పైకి, కిందికీ వర్కవుట్లు చేస్తుంటే పొట్ట కండరాలు, లోయర్ బ్యాక్, హామ్‌స్ట్రింగ్ సైతం గట్టిపడతాయి.
ప్లాంక్ సైడ్‌వాక్
కోర్ కండరాలకు మంచిది. ముంజేతులను నేలపై ఆనించాలి. మోచేయి, భుజాలు ఒకే వరుసలో ఉండాలి. కాళ్లను విస్తరించాలి. కాలి బొటనవేలి నుంచి బాడీ సమాంతరంగా ఉండే పొజిషన్‌కి వచ్చి చేయి, కాళ్లను జరుపుతూ ఎటైనా ఒకవైపు నడవాలి.
ట్రైసెప్ డిప్స్
అప్పర్‌బాడీ, భుజాలు, చేతులకు మంచి వ్యాయామం. ముందు స్టూలు లేదా బెంచీపై నిటారుగా కూర్చోవాలి. చేతులతో ఇరుపక్కలా బెంచీ లేదా స్టూలుని పట్టుకొని కాళ్లను ముందుకు జరపాలి. బాడీ ముందుకు చేతులు వెనక్కి ఉండే పొజిషన్‌కి వచ్చి శరీరాన్ని కిందికీ పైకీ వర్కవుట్ చేయాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
JEE Main: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
World News
Earthquake: ఈ దేశాల్లో నిత్యం భూప్రళయాలే
-
India News
Punjab: చేతులతో నాలుగు బుల్లెట్ బైక్‌లను ఆపిన యువకుడు
-
India News
Marriage: వరుడికి 65.. వధువుకు 23
-
World News
Earthquake: తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’