యువతా.. దేశభక్తి చాటండి!

రేపే జెండా పండగ. యువత తమ దేశభక్తిని చాటుకునేలా, దేశమంతా ఒక్కతాటిపైకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం rashtragaan.in వెబ్‌సైట్‌తో ఒక ప్రయత్నం చేస్తోంది.

Updated : 14 Aug 2021 00:49 IST

రేపే జెండా పండగ. యువత తమ దేశభక్తిని చాటుకునేలా, దేశమంతా ఒక్కతాటిపైకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం rashtragaan.in వెబ్‌సైట్‌తో ఒక ప్రయత్నం చేస్తోంది. ఇందులో ఎవరైనా వీడియోలు రూపొందించి, జాతీయ గీతాన్ని అప్‌లోడ్‌ చేయొచ్చు. ఎంపిక చేసిన వీడియోలన్నింటినీ క్రోడీకరించి ఒకే వీడియోగా మలిచి ఆగస్టు 15న అందుబాటులో ఉంచుతారు. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లోని విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)ని కోరింది. కరోనా కారణంగా వేడుకలన్నీ ఎక్కువగా ఆన్‌లైన్‌కే పరిమితం చేయడంతో, ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో పాల్గొన్న కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం ధ్రువీకరణ పత్రం అందజేస్తుంది. 12 భారతీయ భాషల్లో వీడియోలు రికార్డు చేసి అప్‌లోడ్‌ చేయొచ్చు.

* అధికారిక వెబ్‌సైట్‌ rashtragaan.in తెరవాలి.

* విద్యార్థి వివరాలు నమోదు చేయాలి.

* రికార్డింగ్‌ లింక్‌లోకి వెళ్లి వీడియోలు రికార్డు చేసి అప్‌లోడ్‌ చేయాలి.

* అక్కడి నుంచే సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని