సరదా.. మారుతోంది
‘అరే మామా కొత్త సినిమా మస్త్‌గా ఉందంటా. ఈ వీకెండ్ ప్లాన్ చేద్దాం’. ఇద్దరు కుర్రాళ్లు కలిస్తే ఈ మాట కామన్. యువతకు వినోదం పంచేది అత్యధికంగా సినిమానే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ప్రముఖ వార్తా సంస్థ చేసిన సర్వేలో యువతకి తాజా వినోద మార్గాలివి.
ఓటీటీ: ఇది ఓటీటీ జమానా. సినిమా చూడటానికి కాళ్లీడ్చుకుంటూ థియేటర్‌కే వెళ్లాల్సిన అవసరమేం లేదు. ఒక్క క్లిక్‌తో ఫస్ట్ డే.. ఫస్ట్ షోని మన స్మార్ట్‌ఫోన్‌లోనే చూసేయొచ్చు. పెద్ద తెర కావాలనుకుంటే టీవీ, హోం థియేటర్‌కి అనుసంధానం చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడివరకైనా, ఏ సమయంలోనైనా చూసి ఆపేయొచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, జీ5.. ఇలాంటి వేదికలు బోలెడు. కరోనా పీడ తొలగినా, యూత్ ఓటీటీకే అతుక్కుపోవడంతో.. భవిష్యత్తులో సినిమాహాళ్లు కళకళలాడేది అనుమానమే అంటున్నాయి సర్వేలు.
పాడ్‌కాస్ట్: తమను మస్తీలో ముంచెత్తుతాయని యువత భావిస్తున్న మరో ఎంటర్‌టైన్‌మెంట్ వేదిక పాడ్‌కాస్ట్. రేడియోకి ఆధునిక రూపమే పాడ్‌కాస్ట్ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా, ఎక్కడైనా అభిరుచికి అనుగుణమైన షోలు వినే అవకాశం ఉండటంతో పాడ్‌కాస్ట్‌లు యువతను బాగానే ఆకట్టుకుంటున్నాయి. వినోదంతోపాటు విజ్ఞానాన్నీ పంచడం వీటికున్న ప్లస్‌పాయింట్.
మొబైల్ గేమింగ్: ట్వీన్స్, టీన్స్ నుంచి అంకుల్స్ దాకా మొబైల్ గేమింగ్‌కి ఫిదా అవుతున్న వారెందరో. ఇది తాజా వినోద సాధనంగా మారిపోయింది. హిందూ బిజినెస్‌లైన్ సర్వే ప్రకారం 2020లో దీని మార్కెట్ వాటా ఏడువేల కోట్లు ఉంటే.. 2023 నాటికి మూడురెట్లు అధికమైంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. ఈ ట్రెండ్ యూత్‌ని ఎంత హస్తగతం చేసుకుందో! ఒకవైపు కన్‌సోల్, కంప్యూటర్ వీడియోగేమ్‌లు విపరీతంగా అమ్ముడవుతుంటే మరోవైపు ఫ్రీ ఫైర్, లూడో కింగ్, క్యాండీ క్రష్‌లాంటి గేమ్స్‌కి క్రష్ అవుతున్న కుర్రకారూ ఎక్కువే.
సామాజిక మాధ్యమాలు: కాలేజీ విద్యార్థి, క్యాబిన్‌లో ఉద్యోగి.. ప్రతి ఒక్కరికీ అతిపెద్ద వినోద సాధనం సామాజిక మాధ్యమం. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విటర్, యూట్యూబ్, వాట్సాప్.. ఇలా వీటిని ఉపయోగించని వారు ఈ కాలంలో అరుదే. సోషల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌కి మాత్రమే కాదు.. వీటిని సమాచార, అనుబంధాల వారధిగా కూడా వాడుకుంటున్న వాళ్లు ఉన్నారు.
* మొత్తానికి ఒకప్పుడు ఆటలు, సినిమాలతో ఆనందాన్ని ఆస్వాదించేవాళ్లం. ఇప్పుడు డిజిటల్ వేదికలపైనే వినోదాన్ని వెతుక్కుంటున్నాం అన్నమాట!
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Colombia: బుల్‌ఫైట్ జరుగుతుండగా స్టేడియం గ్యాలరీ కూలి..
-
Politics News
Andhra News: సీఎంను కలిసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి
-
Sports News
Virender Sehwag: రోహిత్ శర్మను టీ20 కెప్టెన్‌గా తప్పించొచ్చు: సెహ్వాగ్
-
General News
Khairatabad Ganesh: ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడి రూపమిదే!
-
Movies News
Samantha: సల్మాన్ వీడియోపై సామ్ ‘లవ్’ రిప్లై
-
Business News
ITR filing: ట్యాక్స్ ఫైలింగ్‌కి సిద్ధమయ్యారా? ఈ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- చెరువు చేనైంది