నాడి పట్టే టీషర్ట్‌

పక్క ఫొటో చూశారా? ఇది ‘హెచ్‌-టీ హెల్త్‌ మానిటరింగ్‌ టీషర్ట్‌’. కుర్రాళ్లు దీన్ని ధరిస్తే స్టైల్‌గా ఉండటమే కాదు.. ఆరోగ్యాన్ని కనిపెట్టుకొని ఉండే సహాయకుడిగా పని చేస్తుంది. దీని లోపలి భాగంలో అమర్చిన

Updated : 27 Nov 2021 06:31 IST

ధర రూ.8వేలు

క్క ఫొటో చూశారా? ఇది ‘హెచ్‌-టీ హెల్త్‌ మానిటరింగ్‌ టీషర్ట్‌’. కుర్రాళ్లు దీన్ని ధరిస్తే స్టైల్‌గా ఉండటమే కాదు.. ఆరోగ్యాన్ని కనిపెట్టుకొని ఉండే సహాయకుడిగా పని చేస్తుంది. దీని లోపలి భాగంలో అమర్చిన ఎలక్ట్రోడ్‌లు, సెన్సర్లు శరీరంలోని స్పందనలు, గుండె కొట్టుకునే విధానం, ఉష్ణోగ్రతల ఆధారంగా బీపీ, ఈసీజీ, హెచ్‌ఆర్‌వీ, బీఎంపీ వివరాలు ఎప్పటికప్పుడు అందజేస్తుంటాయి. Ti-Patch design కంపెనీ రూపొందించింది. అదే పేరుతో ఉన్న యాప్‌ని ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకొని అనుంధానం చేసుకుంటే చాలు. వివరాలు తెరపై ప్రత్యక్షమవుతాయి. ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని