మానేస్తున్నారా?

యూత్‌కి దూకుడెక్కువ! చేస్తున్న ఉద్యోగం ఏమాత్రం నచ్చకపోయినా.. బాస్‌ పోరు భరించలేకున్నా.. వేరేచోట మంచి ప్యాకేజీ వస్తుందని భావించినా.. ఠపీమని ఉద్యోగం మానేస్తారు.

Updated : 18 Dec 2021 06:23 IST

యూత్‌కి దూకుడెక్కువ! చేస్తున్న ఉద్యోగం ఏమాత్రం నచ్చకపోయినా.. బాస్‌ పోరు భరించలేకున్నా.. వేరేచోట మంచి ప్యాకేజీ వస్తుందని భావించినా.. ఠపీమని ఉద్యోగం మానేస్తారు. ఈమధ్యలో ఏదైనా తలకిందులైతే ‘అయ్యో తొందరపడ్డానే..’ అని తెగ బాధ పడిపోతుంటారు. అందుకే ఈ కిందివి పాటించినప్పుడే.. జాబ్‌ మానేయాలంటారు పెద్దలు.

* మీ జీతానికి రెట్టింపు అదనపు ఆదాయం సంపాదిస్తున్నప్పుడు.
* ఉద్యోగం లేకపోయినా ఏడాదిపాటు నెట్టుకురాగలిగేలా బ్యాంకులో బ్యాలెన్స్‌ ఉన్నప్పుడు.
* స్టార్టప్‌, వ్యాపారం, ఇతర ఉపాధితో బతుకు బండి నడపగలిగేలా కచ్చితమైన నైపుణ్యం సాధించినప్పుడు.
* సొంత పనిలో నైన్‌ టూ ఫైవ్‌ పనివేళలు కుదరవు. రోజుకి 12 నుంచి 16 గంటలైనా చేయగలిగే ఓపిక ఉన్నప్పుడు.
* కొత్త పాత్రలో సర్దుకుపోయేలా ఓపిక ఉన్నప్పుడు, క్రమశిక్షణ పాటించగలినప్పుడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని