మాగ్నెటిక్‌ ఛార్జర్‌..

కాలి వేలి నుంచి తలపై ధరించే టోపీ దాకా అన్నీ ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు యూత్‌. మరలాంటిది వేలకు వేలు పోసి కొన్న స్మార్ట్‌ఫోన్‌కి పెట్టే ఛార్జర్‌ ప్రత్యేకంగా ఉండాలనుకోరా? ఈ ఆసక్తిని కనిపెట్టింది

Updated : 08 Jan 2022 06:09 IST

కాలి వేలి నుంచి తలపై ధరించే టోపీ దాకా అన్నీ ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు యూత్‌. మరలాంటిది వేలకు వేలు పోసి కొన్న స్మార్ట్‌ఫోన్‌కి పెట్టే ఛార్జర్‌ ప్రత్యేకంగా ఉండాలనుకోరా? ఈ ఆసక్తిని కనిపెట్టింది గనకే ZCool కంపెనీ The UFO MagSafe wireless charger అనే సరికొత్త ఛార్జర్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఇది యాపిల్‌ ఫోన్లకే ప్రత్యేకం. మ్యాగ్‌సేఫ్‌ ఛార్జర్‌లాగే మాగ్నెటిక్‌తో పని చేస్తుంది. ఈ ఛార్జర్‌ని ఫోన్‌ వెనక వైపు అతికిస్తే చాలు.. గంటలో ఫుల్‌ ఛార్జింగ్‌ అవుతుంది. గ్రహాంతర జీవుల వాహనంలా డిజైన్‌ భలే స్టైలిష్‌గా ఉంటుంది. ఛార్జింగ్‌ అయ్యేటప్పుడు, పూర్తైన తర్వాత ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో వెలుగులు విరజిమ్ముతుంది. 15వాట్ల కరెంటుతో పని చేస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని