Samantha:సమంత.. సయ్యా?

మన సమంతా ‘లెవల్‌-అప్‌’ అంటూ మరో కొత్త ఛాలెంజ్‌కి తెర తీసింది. ఇన్‌స్టా వేదికగా సవాల్‌ విసిరింది. అభిమానులే కాదు.. బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ స్పందించింది. మద్దతు తెలుపుతున్నట్టుగా ‘ఫైర్‌’

Updated : 15 Jan 2022 13:56 IST

మన సమంతా ‘లెవల్‌-అప్‌’ అంటూ మరో కొత్త ఛాలెంజ్‌కి తెర తీసింది. ఇన్‌స్టా వేదికగా సవాల్‌ విసిరింది. అభిమానులే కాదు.. బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ స్పందించింది. మద్దతు తెలుపుతున్నట్టుగా ‘ఫైర్‌’ ఎమోజీని జోడించింది. ఏంటీ లెవల్‌అప్‌? అంటే దీన్నే ‘నీల్‌ జంపింగ్‌’, ‘నీల్‌ స్క్వాట్‌ జంప్‌’ అనొచ్చు అంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. చేయడానికి వ్యాయామ పరికరాలూ అవసరం లేదు. ఈ ఛాలెంజ్‌ ప్రధాన ఉద్దేశం నాజూగ్గా, మెరుపుతీగలా మారిపోవడం.

ఎలా చేయాలి?

ముందు వజ్రాసనం వేసి, తర్వాత ముందుకు దూకాలి. తర్వాత యథాస్థానంలోకి వచ్చి మళ్లీ జంప్‌ చేయాలి. జిమ్‌, పరికరాలు, శిక్షకుడు ఏమీ అవసరం లేదు.
* క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవాళ్లకైతే ఫర్వాలేదుగానీ కొత్తవాళ్లు, బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు చేస్తే మోకీళ్లు దెబ్బతింటాయంటున్నారు నిపుణులు.

లాభాలు?


* గుండె పనితీరు మెరుగవుతుంది.

* తొడలు మంచి ఆకృతి సంతరించుకుంటాయి.

* అత్యధికంగా ఉన్న కేలరీలు కరుగుతాయి.

* థై, కోర్‌ మజిల్స్‌ దృఢమవుతాయి.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు