Updated : 22 Jan 2022 06:21 IST

బాలీవుడ్‌ నచ్చేసిందిట..

మన బాలీవుడ్‌ బాగా నచ్చేసిన హాలీవుడ్‌ తారల జాబితాలో మరో అమ్మడు చేరింది. తనే.. సమంతా లాక్‌వుడ్‌. ‘షూట్‌ ద హీరో’ సినిమాతో స్టార్‌డమ్‌ సంపాదించుకున్న ఈ భామ ఫ్యాషన్‌ మోడల్‌, వ్యాపారవేత్త కూడా. గత నెలలో సల్మాన్‌ఖాన్‌ జన్మదిన వేడుకల్లో సందడి చేసింది. తర్వాత మరో కండల వీరుడు హృతిక్‌రోషన్‌ని ‘నైస్‌ లుకింగ్‌ గయ్‌’ అని పొగుడుతూ, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పెట్టింది. మేమిద్దరం తరచూ కలుస్తాం అని కూడా చెప్పుకొచ్చింది. అన్నట్టు.. హృతిక్‌, సమంతాలిద్దరు భాగస్వాములుగా ముంబయిలో ఓ యోగా స్టూడియో పెట్టబోతున్నారని వినికిడి. మొత్తానికి సమంతా ఏదోరకంగా భారత రంగప్రవేశం ఖాయం చేసుకుందన్నమాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని