పనిలో.. ఎదురుండదు

సరదాలు, సంతోషాలే కాదు.. ఆఫీసులో అప్పుడప్పుడు చికాకులు, గందరగోళం కూడా ఉంటాయి. చుట్టుపక్కల ఉన్న గోల కారణంగా ఒక్కోసారి పని సరిగా చేసుకోలేం. అలాంటివాళ్ల కోసం ఏకాగ్రత కుదిరేలా...

Published : 09 Apr 2022 01:25 IST

నయా గ్యాడ్జెట్‌

ధర: రూ.4వేలు

సరదాలు, సంతోషాలే కాదు.. ఆఫీసులో అప్పుడప్పుడు చికాకులు, గందరగోళం కూడా ఉంటాయి. చుట్టుపక్కల ఉన్న గోల కారణంగా ఒక్కోసారి పని సరిగా చేసుకోలేం. అలాంటివాళ్ల కోసం ఏకాగ్రత కుదిరేలా ‘హెల్మ్‌ఫాన్‌’ విపణిలోకి అందుబాటులోకి వచ్చేసింది. దీన్ని తలపై ధరిస్తే చుట్టుపక్కల ఉన్న ప్రపంచంతో మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఏం జరిగినా వినపడదు, కనపడదు. ఫైబర్‌గ్లాస్‌, పాలిథిన్‌ ఫోమ్‌తో తయారు చేశారు. ల్యాప్‌టాప్‌, పీసీలపైనే దృష్టి పెడుతూ ఎంచక్కా పని చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ చూసే వీలుంటుంది. చెవుల్లో ఇయర్‌ఫోన్‌, తలకి హెడ్‌సెట్‌ కూడా పెట్టుకోవచ్చు. రకరకాల రంగుల్లో, డిజైన్లలో లభిస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని