నీరు తాగారా?

కాలేజీ కుర్రాళ్లు, ఆఫీసుకెళ్లే ఉద్యోగులు.. అందరి బ్యాగులో వాటర్‌ బాటిల్‌ ఉండటం మామూలే. ఎండలు మండిపోతున్న ఈ సమయంలో మరింత అత్యవసరం. డీ-హైడ్రేషన్‌కి గురి కాకుండా ఉండాలంటే నీరు అధికంగా తీసుకోవడం

Updated : 12 Aug 2022 14:02 IST

కాలేజీ కుర్రాళ్లు, ఆఫీసుకెళ్లే ఉద్యోగులు.. అందరి బ్యాగులో వాటర్‌ బాటిల్‌ ఉండటం మామూలే. ఎండలు మండిపోతున్న ఈ సమయంలో మరింత అత్యవసరం. డీ-హైడ్రేషన్‌కి గురి కాకుండా ఉండాలంటే నీరు అధికంగా తీసుకోవడం తప్పనిసరి. అన్నీ స్మార్ట్‌గా మారుతున్న వేళ   నీళ్ల సీసా కూడా స్మార్ట్‌గా తయారై Hidrate Spark 3 పేరుతో వచ్చేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. బ్లూటూత్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. నీరు తాగాల్సిన గడువు సెట్‌ చేసుకుంటే  ఆ సమయానికి మూతపై లైటు వెలగడం ద్వారా నీరు తాగమని  గుర్తు చేస్తుంది. రోజులో ఎంత నీరు తాగామో, ఇంకా ఎంత తాగాలో సెల్‌ఫోన్‌ తెరపై వివరాలతో సహా చెబుతుంది. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని