నారాయణమూర్తి.. 4 మాటలు

ఎన్‌.ఆర్‌.నారాయణమూర్తి.. కలల సాధకులకు దిక్సూచి. అంకురాలతో అందలం అందుకోవాలని తపించే యువతకు మార్గదర్శి. సాధారణ కుటుంబంలో పుట్టి దిగ్గజ ఇన్ఫోసిస్‌ని తీర్చిదిద్దిన శిల్పి. ఆయన జీవితం, జీవనశైలీ కుర్రకారుకు స్ఫూర్తి పాఠం. ఆయన నుంచి మనమేం నేర్చుకోగలమంటే..

Updated : 07 May 2022 05:38 IST

ఎన్‌.ఆర్‌.నారాయణమూర్తి.. కలల సాధకులకు దిక్సూచి. అంకురాలతో అందలం అందుకోవాలని తపించే యువతకు మార్గదర్శి. సాధారణ కుటుంబంలో పుట్టి దిగ్గజ ఇన్ఫోసిస్‌ని తీర్చిదిద్దిన శిల్పి. ఆయన జీవితం, జీవనశైలీ కుర్రకారుకు స్ఫూర్తి పాఠం. ఆయన నుంచి మనమేం నేర్చుకోగలమంటే..

* భారీ కలలు: చేతిలో పైసా లేకపోయినా స్వప్నం, లక్ష్యం పెద్దదిగా ఉండాలంటారు నారాయణమూర్తి. 1981లో ఆయన భార్య నగలు కుదువబెట్టి మరీ రూ.10వేలతో ఇన్ఫోసిస్‌ ప్రారంభించారు. అంతటి కఠిన పరిస్థితుల్లోనూ తాను ఓ దిగ్గజ సంస్థని సృష్టిస్తున్నాననే నమ్మకంతోనే ఉన్నారు.
* ముందుచూపు: కెరీర్‌ తొలినాళ్లలో భారీ వేతనం అందుకుంటున్నా, ఎంతో మంచి స్థాయిలో ఉన్నా.. ఉన్నదాంతో ఎప్పుడూ సరిపెట్టుకోలేదాయన. తనదైన ముద్ర వేయాలని తపించిపోయేవారు. ఒక సంస్థలో పని చేయడం కాదు.. దేశం గర్వించే ఓ కంపెనీ సృష్టించాలని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లో చదువుతున్నప్పుడే ప్రణాళిక వేసుకున్నారు.
* నిజాయతీ: ‘విలువలు, నైతికత లేని ఎదుగుదల కలకాలం నిలిచి ఉండదు’ అంటారు నారాయణమూర్తి. ముందు నుంచీ నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా అడ్డదారిలో వెళ్లలేదు. నాలుగేళ్ల కిందట సంస్థ ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సైతం ఆయన విలువలే కాపాడాయంటారు.
* ఎదిగినా ఒదగడమే: వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఒదిగి ఉంటారు. కోట్లకు పడగలెత్తినా విలాసాలు, ఆడంబరాలకు వెళ్లరు. కార్లు, బంగ్లాలకన్నా మంచి పుస్తకాలు కొనడానికి ఇష్టపడతారు. ‘మన నడక, నడతలో ఐశ్వర్యం ఉండాలి.. మనం ఐశ్వర్యంతో సహజీవనం చేయద్దు’ అంటారాయన.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని