తిరిగి ఇచ్చేద్దాం..
స్ఫూర్తి కెరటం
మృదుస్వభావి, దానకర్ణుడు.. విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ గురించి మనకు చాలానే తెలుసు. మరి ఆయన నుంచి ఏం నేర్చుకోగలం?
నచ్చిందే చేయాలి: ప్రేమ్‌జీ ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకొని తిరిగొచ్చారు. వైట్ కాలర్ ఉద్యోగం వెతుక్కొమ్మని సలహా ఇచ్చారు సన్నిహితులు. కుటుంబ నూనెల వ్యాపారంలోకి అడుగు పెడతానన్నారు. వేరేవాళ్లు జీతం, సౌకర్యాల గురించి చెబితే.. ప్రేమ్‌జీ వ్యాపారంలో అవకాశాలు వెతికారు.
సర్దుకుపోవడం: ఒకరు నెలకి పాతిక వేలు సంపాదిస్తే.. మరొకరు కోటి కూడబెడతారు. వాళ్లతో పోల్చి చూసుకుంటే సంతోషం దక్కదు. ఉన్నదాంట్లోనే సంతోషం వెతుక్కోవాలంటారు అజీం. అలాగని పనిలో పోటీ పడటం మానొద్దంటారు.
వైఫల్యాలు: గొప్ప బ్యాట్స్‌మన్ కూడా మైదానంలోకి దిగిన ప్రతిసారీ సెంచరీ కొట్టలేడు. ఒక్కోసారి సున్నాకే ఔటవుతాడు. ప్రతిభ ఉన్నా, ఎంత కష్టపడ్డా ఒక్కోసారి వైఫల్యాలు తప్పవు. వాటిని స్వీకరించాలి.
విలువలు: కెరీర్, వ్యాపారం, ఎంచుకున్న రంగంలో.. పరిస్థితులకు అనుగుణంగా మన పని తీరు మారాలే తప్ప.. నమ్మిన సిద్ధాంతాలు, విలువల విషయంలో రాజీ పడొద్దు అంటారు ప్రేమ్‌జీ.
తిరిగి ఇవ్వడం: సమాజం నుంచి తీసుకున్నప్పుడు.. కొంచెమైనా తిరిగి ఇవ్వాలంటారు. తన సంపాదనలో మూడోవంతు దానధర్మాలు చేశారాయన. మన సాయం ద్వారా కొందరి జీవితాల్ని నిలబెడితే పొందే ఆనందం మరేందులోనూ ఉండదంటారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Shubman Gill: టిండర్‌లో శుభ్‌మన్ గిల్
-
Crime News
Andhra News: ప్రియురాలికి వేరొకరితో నిశ్చితార్థం.. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు
-
Crime News
వరంగల్‌లో భాజపా నేత ఆత్మహత్య.. నమ్మినవారు మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో
-
India News
స్కూల్‌బస్ డ్రైవర్‌కు గుండెపోటు.. స్టీరింగు తిప్పిన విద్యార్థిని
-
Sports News
Iftikhar Ahmed: ఇఫ్తికార్.. 6 బంతుల్లో 6 సిక్స్‌లు
-
Politics News
Yamini Sharma: జగన్ ఇచ్చేది పావలా.. వసూలు చేసేది రూపాయి: యామినీశర్మ