Updated : 01 Oct 2022 04:34 IST

ఫోన్‌.. పడ్డా పగలదు

జేబులో పర్స్‌ లేనివాళ్లు ఉండొచ్చేమోగానీ.. ఈరోజుల్లో చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ లేనివాళ్లు అరుదు. అందులోనూ మంచి ఫీచర్లు ఉంటే ధర ఎక్కువైనా వెనకాడరు కుర్రకారు. మరి అంత ఖరీదు పెట్టి కొన్న మొబైల్‌ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా! వీటి రక్షణ కోసం స్క్రీన్‌గార్డ్‌లు, బ్యాక్‌కవర్లు అంటూ ఎన్నో ఉపకరణాలు ఎప్పటికప్పుడు విపణిలోకి వచ్చేస్తున్నాయి. అందులో ఒకటి The Unichest Linkori smartphone accessory దీన్ని ఫోన్‌ వెనకభాగంలో అతికించుకోవచ్చు. మందం ఏడు మిల్లీమీటర్లే. అల్యూమినియంతో తయారు చేయడంతో దృఢంగా, ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. ఫోన్‌ పొరపాటున కింద పడితే పగిలిపోకుండా కాపాడుతుంది. దీన్ని స్టాండ్‌లా కూడా వాడుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts