Updated : 17 Dec 2022 01:05 IST

బాధ వలదు బాలా

మధ్య ‘బాలా’ అనే సినిమా వచ్చింది. అందులో హీరోది బట్టతల సమస్య. అతగాడి పాట్లు మనకి తెగ నవ్వు తెప్పిస్తాయి గానీ.. యుక్త వయసులోనే జుట్టు ఊడిపోవడం, బట్టతల రావడం.. కుర్రకారుకి ఒక భరించలేని సమస్య. దీని కారణంగా నలుగురిలోకి వెళ్లాలంటే భయం. అమ్మాయిలు కనిపిస్తే హడల్‌. ఇది మానసిక సమస్యగా మారకుండా ఉండాలంటే.. ఇలా సర్దిచెప్పుకోవాల్సిందే.

ఒప్పుకోవాల్సిందే: బాధ పడుతూ కూర్చుంటే సమస్య తీరదు. ప్రాక్టికల్‌గా ఆలోచించాల్సిందే. వెంట్రుకలు ఊడిపోతే, బట్టతల వస్తే ప్రాణాలేం పోవు. వైకల్యం సంభవించదు. దాని గురించి అతిగా దిగులు చెందాల్సిన పని లేదు.

అప్రమత్తం: జుత్తు ఊడిపోతుందని గుర్తించిన వెంటనే చర్యలు చేపట్టాలి. హెయిర్‌ లాస్‌కి ఏదైనా పరిష్కారం ఉందా? థెరపీలు పని చేస్తాయా? ఆలోచించాలి. ఆచరించాలి.

స్టైల్‌: జుత్తు ఊడిపోయినా.. ఉన్న కొద్ది వెంట్రుకలతోనే కవర్‌ చేసే స్టైల్‌ని ఎంచుకోవచ్చు. దీంతో మనసుకి కొంతైనా ఉపశమనం కలుగుతుంది.

ప్రత్యామ్నాయం: పోయిన జుత్తుని ఎలాగూ తిరిగి తీసుకురాలేం. టోపీ పెట్టుకోవడం, పూర్తిగా గుండు చేసుకొని కొత్త స్టైల్‌ బాట పట్టడం.. లాంటి పద్ధతులు పాటించవచ్చు.

సానుకూలంగా: శారీరక వైకల్యం ఉన్నవాళ్లు, అందంగా లేనివాళ్లూ ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. వాళ్లని స్ఫూర్తిగా తీసుకోవాలి.

అనుభవజ్ఞులు: తలపై జుత్తు లేనివాళ్లు మీరొక్కరే కాదు. సీనియర్లు మొదట్లో మీలాగే బాధ పడ్డా సర్దుకుపోయి ఉంటారు. ఆ డిప్రెషన్‌ నుంచి ఎలా బయట పడ్డారో కనుక్కొని వాళ్ల నుంచి సలహాలు తీసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు