కొత్త యేడుకి ఆశల స్వాగత తోరణాలు

కళాశాల ఫ్రెషర్స్‌ డే కోసం అందంగా ముస్తాబైన కన్నెపిల్లలా వచ్చింది 2022. పక్కనే కూర్చొని ప్రతీదీ షేర్‌ చేసుకునే జిగిరీ దోస్త్‌లా మరుపురాని అనుభూతులు పంచింది.

Published : 31 Dec 2022 01:11 IST

కళాశాల ఫ్రెషర్స్‌ డే కోసం అందంగా ముస్తాబైన కన్నెపిల్లలా వచ్చింది 2022. పక్కనే కూర్చొని ప్రతీదీ షేర్‌ చేసుకునే జిగిరీ దోస్త్‌లా మరుపురాని అనుభూతులు పంచింది. తప్పు చేస్తే మొట్టికాయలు వేసి మరీ చెప్పే గురువులా అనుభవ పాఠాలు బోధించింది. కనుసైగ చేస్తూ అప్పుడప్పుడు వలపు వల విసిరే ప్రేయసిలా మధుర జ్ఞాపకాలూ మిగిల్చింది. ఈ మంచీచెడుల రుచుల ఆస్వాదన నుంచి తేరుకోకముందే.. యాక్సిలేటర్‌ పెంచి క్యాంపస్‌లోకి రివ్వున దూసుకొచ్చిన కొత్త బైక్‌లా రానే వచ్చింది 2023. అందుకే... పాత సంగతులను మనసు పొరల్లో నిక్షిప్తం చేసుకొని కొత్త యేడుకి కోటి ఆశల స్వాగత తోరణాలు కడదాం..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని