Published : 14 Jan 2023 00:27 IST

బాత్రూమే.. ప్రశాంతం

మీ మనసుకి బాగా ప్రశాంతతనిచ్చే ప్రదేశం ఏదంటే మీరేం చెబుతారు? పార్క్‌.. సినిమా హాలు.. ఆఫీసు.. ఇవేం కాకుండా రెస్ట్‌రూం అంటారా? ఔను.. మీరే కాదు.. యువతలో అత్యధికులది ఇదేమాట. రెస్ట్‌రూంకి వెళ్లి కాసేపు సేదతీరితే మనసుకి హాయిగా ఉంటుంది అనేవాళ్లలో అమ్మాయిలు, అబ్బాయిలు.. ఇద్దరూ ఉన్నారు. అందునా టాయ్‌లెట్‌ కమోడ్‌పై కూర్చొని రిలాక్స్‌గా ఫీలవడం ఎక్కువమందికి ఇష్టమట. బ్రిటన్‌కి చెందిన ఒక సంస్థ నాలుగువేల మందితో ఆన్‌లైన్‌లో చేసిన అధ్యయనంలో ఈ అభిప్రాయాలు వెల్లడయ్యాయి. ఇరుకు ఇళ్లలో నివసించేవారు, కుటుంబంలో ఎక్కువమంది సభ్యులు ఉన్నవారు, ఇంట్లో చిన్నపిల్లల గోల ఉన్నవాళ్లు అయితే గంటలకొద్దీ అక్కడే గడుపుతున్నామని సెలవిచ్చారు. ఇంటా, బయటా మొత్తమ్మీద ప్రశాంతంగా ఉండే చోటు అదొక్కటేనని భావిస్తున్నారు. ఈ సమయంలో ఏదైనా సీరియస్‌ విషయం మీద ఆలోచించడం.. ఫోన్‌ చూడటం.. సన్నిహితులతో మాట్లాడటం.. ఇలాంటివన్నీ సౌకర్యంగా ఉన్నాయట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని