కొంటె కొటేషన్‌

స్లీవ్‌లెస్‌ బనియన్‌ వేసి ఓ వదినె కుస్తీలు పట్టెటోడే...జిమ్‌లోనే కునుకు వెట్టి.. గురకలు పెడుతుండాడే! 

Published : 27 May 2023 00:37 IST

* స్లీవ్‌లెస్‌ బనియన్‌ వేసి ఓ వదినె కుస్తీలు పట్టెటోడే... జిమ్‌లోనే కునుకు వెట్టి.. గురకలు పెడుతుండాడే! 

శ్రీమయీ రఘుప్రోలు, పెంట్లవెల్లి

* సైక్లింగ్‌తో వచ్చిందేమో బడలిక... అందుకే వేశాడు పడక!

కొండలరావు, దూసి

* కసరత్తులతో కావాలి రెమో... అలా జోగితే అవుతావు సుమో!

పాలూరి అనూష, ఈమెయిల్‌

* ఆవహించెను అలుపు... ట్రెడ్‌మిల్‌ అయ్యింది పరుపు!

మౌనిక తాళ్లూరి, ఈమెయిల్‌

* కండ కలవాడేను మనిషోయ్‌... నిద్ర మాని కష్టపడవోయ్‌!

రామారావు మువ్వల, ఉద్ధవోలు

* నువ్వలా చేస్తే జిమ్‌... జన్మలో కాలేవు స్లిమ్‌!

ఎ.అభిరామ్‌, దూసి

* కుంభకర్ణుడి సోదరా... జిమ్‌లో మొద్దు నిద్ర వద్దురా!

కలివరపు రామకృష్ణ, దూసి

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని