పక్కింటమ్మాయిలా...

అమ్మానాన్నలది సాధారణ కుటుంబం...ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేదు...ఎక్కడా శిక్షణ తీసుకోలేదు... తొలి రోజు తడబడినా...తీక్షణమైన తన కళ్లతో నాచురల్‌గా నటించేసింది...‘గల్ఫ్‌’ చిత్రంలో లక్ష్మి పాత్రలో ఒదిగిపోయింది హైదరాబాద్‌కు చెందిన తెలుగమ్మాయి

Published : 21 Oct 2017 02:00 IST

కట్‌చేస్తే...
పక్కింటమ్మాయిలా... 

అమ్మానాన్నలది సాధారణ కుటుంబం...ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేదు...ఎక్కడా శిక్షణ తీసుకోలేదు... తొలి రోజు తడబడినా...తీక్షణమైన తన కళ్లతో నాచురల్‌గా నటించేసింది...‘గల్ఫ్‌’ చిత్రంలో లక్ష్మి పాత్రలో ఒదిగిపోయింది హైదరాబాద్‌కు చెందిన తెలుగమ్మాయి డింపుల్‌ హయాతీ. పక్కింటి అమ్మాయిలా...వూరిలో పరిచయమైన యువతిలా నటించి మెప్పించింది. పొట్టకూటి కోసం ఎడారి దేశాలకు వెళ్లిన వారి జీవిత గాథల స్ఫూర్తితో దర్శకులు సునీల్‌కుమార్‌రెడ్డి గల్ఫ్‌ చిత్రం తెరకెక్కించారు. దుబాయిలో ఇంట్లో పనిమనిషిగా వెళ్లిన లక్ష్మి పాత్ర పోషించి ప్రశంసలందుకుంటున్న డింపుల్‌ని ఈతరం పలకరించింది...

అవకాశం...
చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనుకునేదాన్ని. అమ్మ మృణాళిని, నాన్న జగన్నాథ పళనివేలు ప్రోత్సాహంతో నటనవైపు అడుగులేశా. ఇంటర్‌ సెకెండ్‌ ఇయర్‌లో గల్ఫ్‌ చిత్రం కోసం ఆడిషన్స్‌కు వెళ్లాను. చాలా మంది వచ్చారు. 32 మందిని ఫైనల్‌ చేస్తే... నేను ఎంపికయ్యాను.
పాత్రలో నిజం...
దర్శకులు సునీల్‌కుమార్‌రెడ్డి కథ కోసం దుబాయ్‌ వెళ్లినప్పుడు అక్కడ చాలా మందితో మాట్లాడారు. అక్కడ 17 ఏళ్ల అమ్మాయి ఆయన ఎదుట కన్నీరు పెట్టుకొని తన కథ చెప్పిందట. ఆ అమ్మాయే నా క్యారెక్టర్‌. దానికి నేనే సరిగ్గా సరిపోతానని నన్ను సెలక్ట్‌ చేశారు.
బాగా నటించానని అంటున్నారు..
నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రను అందిపుచ్చుకున్నాను .‘లక్ష్మీ పాత్రలో ఒదిగిపోయావ్‌’ అని ఎక్కువ మంది ప్రశంసించారు. భావోద్వేగాలు బాగా పలికించావంటూ తెలుగునాట నుంచే కాకుండా తమిళనాడు, కేరళ నుంచి అభినందనలు వస్తున్నాయి
క్లాసికల్‌ డ్యాన్సర్‌ని కూడా...
చిన్నప్పటి నుంచి కూచిపూడి నేర్చుకున్నాను. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రదర్శనలిచ్చాను. గోదావరి పుష్కరాలకు రాజమండ్రిలో, గిన్నిస్‌ రికార్డుకోసం హైదరాబాద్‌లో జరిగిన ప్రదర్శనలో పాల్గొన్నాను.

- కోగటం వీరా, ఈనాడు, హైదరాబాద్‌

స్ఫూర్తి... 

చిన్నప్పుడు తాతయ్య వాళ్లు పాత సినిమాల హీరోలు, హీరోయిన్ల గురించి గొప్పగా చెప్పుకునేవారు. ముఖ్యంగా సావిత్రి గురించి ఎక్కువగా మాట్లాడేవారు. అప్పుడే అనుకున్నా నేనూ నటిగా మారాలని. సావిత్రి గారే నాకు స్ఫూర్తి. ప్రస్తుతం ఇలియానాను ఫాలో అవుతుంటా.

అనుకోండి అయిపోద్ది!

న కలల నుంచే మనం కోరుకునే జీవితం పుడుతుంది. గట్టిగా అనుకుంటే ఆ కలలన్నీ నిజం అవుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని