పాత ఇంజిన్‌తో... కొత్త జీవితం

కొత్తగా ఆలోచించే వారికి ఎప్పుడైనా పురోగతి ఉంటుంది. గుంటూరు జిల్లా రైల్వే క్వారీ గేటు ప్రాంతానికి చెందిన విజయరామరాజు కొత్త మార్గంలో పయనించాడు.

Published : 11 Aug 2018 01:59 IST

సృ‘జనరేషన్‌’
పాత ఇంజిన్‌తో... కొత్త జీవితం

కొత్తగా ఆలోచించే వారికి ఎప్పుడైనా పురోగతి ఉంటుంది. గుంటూరు జిల్లా రైల్వే క్వారీ గేటు ప్రాంతానికి చెందిన విజయరామరాజు కొత్త మార్గంలో పయనించాడు. మంచి ఉపాధి పొంది బాగా సంపాదిస్తున్నాడు. కుటుంబానికి ఆదరవయ్యాడు. ఇంటర్‌, డిప్లొమో కోర్సులు పూర్తిచేసినా... సరిపడా ఆదాయం లేని ఉద్యోగాలే దొరికాయి తొలుత. ఇలా ఇల్లు గడవడం కష్టంగా మారింది. లాభం లేదనుకుంటున్న తరుణంలో మంచి ఐడియా తట్టింది. గుంటూరు ఆటోనగర్‌లో ఓ పాత ఇంజిన్‌ కొని... దాన్ని కొబ్బరి నూనె తీసే యంత్రంగా తయారు చేయించాడు. యంత్రాన్ని ఆటోలో పెట్టి వీధుల్లో తిరుగుతూ.. అక్కడికక్కడే కొబ్బరినూనె తీసివ్వడం ప్రారంభించాడు. ఇంటి వద్దే స్వచ్ఛమైన కొబ్బరి నూనె లభిస్తుండటంతో చాలా మంది ఆదరించారు. ఇప్పుడు విజయరామరాజు యంత్రానికి తీరికే లేకుండా పోయింది మరీ!

చిత్ర కథనం : వంశీ, గుంటూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని