వేగన్ సోకులు..అదిరెన్!
వేగన్ సోకులు..అదిరెన్!
ప్రతి ఫ్యాషన్ వెనక ఓ మూగజీవి రోదన ఉంటుంది... నినాదం కాదిది. నిజం! ఓ తెరవేల్పు వేసుకున్న కోటు కోసమో... ఓ సూపర్‌మోడల్ చేతిలో తళతళలాడే పర్సుగా మారేందుకో రోజూ వేలకొద్దీ జంతువుల్ని వధిస్తూనే ఉన్నారు... చాలామందికి నచ్చని ఈ తరహా ఫ్యాషన్లకు ప్రత్యామ్నాయంగా ‘వేగన్’ సొగసులు బయల్దేరాయి... ఈ తరహా బ్రాండ్ల ఉత్పత్తుల అమ్మకాలు వూపందుకుంటున్నాయి.
చలిని కాచుకునేందుకు ధరించే ఉన్ని కోట్లు, నిత్యం వేసుకునే దుస్తులు, టోపీలు, బెల్టులు, పాదరక్షలు... మనకు నిత్యావసరాలు. రాన్రాను అవే సొగసు సంకేతాలుగా మారాయి. ఎంత ఖరీదైనవి, నాణ్యమైనవి ధరిస్తే అంత గొప్ప అన్నట్టుగా తయారైంది పరిస్థితి. వీటి తయారీకి లక్షల కొద్దీ మూగజీవాల్ని వధిస్తున్నారనే సంగతి మనకు తెలియదు. వీటి చర్మం, బొచ్చు నుంచే పై ఉత్పత్తులు తయారవుతున్నాయి. జంతు ప్రేమికులు సహజంగానే ఈ ఫ్యాషన్లు హర్షించరు. ఇలాంటి వారి కోసమే వేగన్ సొగసులు రంగంలోకి వచ్చాయి.
సహజసిద్ధంగా ప్రకృతి నుంచి లభించే ఉత్పత్తుల నుంచే ఈ వేగన్ బ్రాండ్ల దుస్తులు తయారవుతాయి. పైగా పర్యావరణ అనుకూలం. కృత్రిమ నార (సింథటిక్ ఫైబర్), సోయా ఉత్పత్తులు, కొన్ని రకాలు కూరగాయలు, పండ్లు, రీసైకిల్డ్ నైలాన్, ప్లాస్టిక్ సీసాలు, కార్క్, రబ్బరు, కార్డ్‌బోర్డులు మాత్రమే ఉపయోగిస్తారు. అయినా జంతువుల బొచ్చు, చర్మంతో రూపొందిన దుస్తుల్లాగే ఉండటం వీటి ప్రత్యేకత. రూపంలోనే కాదు వెచ్చదనం ఇవ్వడంలోనూ, స్టైల్‌గా కనిపించడంలోనూ వాటికి ఏమాత్రం తీసిపోవు. ఈ తరహా ఫ్యాబ్రిక్‌తో హ్యాండ్‌బ్యాగులు, జాకెట్లు, పాదరక్షలు, దుప్పట్లు, కోట్లు, వింటర్ బూట్లు, టీషర్టులు, టోపీలు, స్వెట్టర్లు, గ్లోవ్స్‌లు తయారవుతున్నాయి.
ష్రింప్స్, స్టెల్లా మెక్‌క్యాట్నీ, ఫ్రీ పీపుల్, నాస్టీగాళ్, మ్యాట్ అండ్ న్యాట్, బియాండ్ స్కిన్ బ్రాండ్లు ప్రస్తుతం వేగన్ ఫ్యాషన్లకు పెట్టింది పేరు. ఈ బ్రాండ్లు తమ ఫ్యాషన్ ఉత్పత్తుల్లో జంతు అవశేషాలు వాడటం లేదని సగర్వంగా ప్రకటించాయి. వీరికి జంతు ప్రేమిక సంస్థ పెటా కూడా ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రత్యేక దుస్తుల తయారీ ఎప్పుడో మొదలైనా అమ్మకాలు లపందుకున్నది మాత్రం ఈ రెండుమూడేళ్ల నుంచే అంటున్నారు ఫ్యాషన్ రంగ విశ్లేషకులు. ఈ ఉత్పత్తుల ధరలు సైతం అందుబాటులో ఉండటం గమనార్హం. ఇలాంటి బ్రాండ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెటా ఏటా ‘వేగన్ ఫ్యాషన్ అవార్డ్స్’ ఇస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు
-
Movies News
IPL 2023: ఐపీఎల్ వేడుకల్లో రష్మిక, తమన్నా హంగామా.. ‘నాటు’ స్టెప్పులు అదుర్స్ అనాల్సిందే!
-
World News
Heartbreaking Story: మా అమ్మ కన్నీటితో డైరీలో అక్షరాలు తడిసిపోయాయి..!