అమీర్‌ఖాన్‌ కూతుళ్ల హంగామా

అమీర్‌ ప్రతి సినిమా ఓ ప్రయోగమే. షూటింగ్‌ మొదలైన దగ్గర్నుంచి రికార్డుల వసూళ్ల వరకు అన్నీ సంచలనాలే. అదే వూపుతో తాజా చిత్రం ‘దంగల్‌’...

Published : 12 Nov 2016 01:43 IST

అమీర్‌ఖాన్‌ కూతుళ్ల హంగామా

అమీర్‌ ప్రతి సినిమా ఓ ప్రయోగమే. షూటింగ్‌ మొదలైన దగ్గర్నుంచి రికార్డుల వసూళ్ల వరకు అన్నీ సంచలనాలే. అదే వూపుతో తాజా చిత్రం ‘దంగల్‌’ ట్రైలర్‌ విడులైంది. ఈసారి మాత్రం అమీర్‌తో పాటు తెరపై అతగాడి కూతుళ్లుగా నటించిన ఫాతిమా సనా షేక్‌, సన్యా మల్హోత్రల గురించి చర్చలు బాగానే నడుస్తున్నాయ్‌. వాళ్ల వివరాలపై ఓ లుక్కేద్దాం.

** కుస్తీ యోధుడు మహావీర్‌సింగ్‌ పోగట్‌ జీవితం ఆధారంగా దంగల్‌ తెరకెక్కుతుంది. అమీర్‌ మహావీర్‌గా నటిస్తుంటే ఫాతిమా, సన్యాలు మహావీర్‌ కూతుళ్లు గీతా పోగట్‌, బబితా కుమారిల పాత్రలు పోషిస్తున్నారు.

** ఫాతిమా మరెవరో కాదు.. చాచీ 420లో కమల్‌హాసన్‌ ముద్దుల కూతురిగా నటించిన పాప. తర్వాత వన్‌ 2 కా 4, మరో రెండు సినిమాల్లో నటించింది. పెద్దయ్యాక తెరపై కనిపించడం ఇదే మొదటిసారి.

** సన్యా మల్హోత్రా దిల్లీ అమ్మాయి. బ్యాలెట్‌ డ్యాన్స్‌లో పట్టుంది. వెండితెరకు కొత్తే అయినా బుల్లితెరపై నటించిన అనుభవం ఉంది. గతంలో అమీర్‌తో కలిసి టాటా స్కై వాణిజ్య ప్రకటనలో నటించింది.

** అమీర్‌ జరిపిన దివాళీ వేడుకల్లో ఈ ఇద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫాతిమా సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోగా, సన్యా పొట్టి స్కర్టులో కనువిందు చేసింది.

** మరో ప్రైవేటు పార్టీలోనూ ఈ జంట తళుక్కుమంది. ఫాతిమా డెనిమ్‌ షార్ట్స్‌లో, సన్యా బటన్‌ఫ్రంట్‌ స్కర్టు, టాప్‌లో దర్శనమిచ్చి తాము కేవలం చిన్నాచితకా పాత్రలకే కాదు.. హీరోయిన్లుగానూ రాణిస్తామని చెప్పకనే చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని