ఎయిర్‌పోర్ట్‌లో సొగసుల షో

పేద్ద ర్యాంప్‌.. చుట్టూ జనాలు.. క్లిక్‌మనిపిస్తూ కెమేరాలు.. ఫ్యాషన్‌ షో అంటే చాలా తతంగమే ఉంటుంది. పాప్‌సింగర్‌ రిహాన్నా మాత్రం ఈ ట్రెండ్‌ని తిరగరాసింది.

Published : 18 Feb 2017 01:18 IST

ఎయిర్‌పోర్ట్‌లో సొగసుల షో

పేద్ద ర్యాంప్‌.. చుట్టూ జనాలు.. క్లిక్‌మనిపిస్తూ కెమేరాలు.. ఫ్యాషన్‌ షో అంటే చాలా తతంగమే ఉంటుంది. పాప్‌సింగర్‌ రిహాన్నా మాత్రం ఈ ట్రెండ్‌ని తిరగరాసింది. ఏకంగా విమానాశ్రయంలోనే క్యాట్‌వాక్‌ చేసి ఫొటోషూట్‌ కూడా చేసేసింది. ఎంచక్కా పైలట్‌ దుస్తులు ధరించి హొయలు ఒలకబోసి ఆనక కురచ దుస్తులతో పిల్లినడకలు నడిచింది. అట్లాంటిక్‌ మహాసముద్రం మీదుగా విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలెట్‌ అమేలియా ఇయర్‌హార్ట్‌కి నివాళిగా ఈ సొగసుల షో నిర్వహించిందట. అయితే ఇదేదో కొత్తగా ఉందని ఈ ట్రెండ్‌నే అనుసరిస్తున్నారు ఫ్యాషన్‌ పండితులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని