ఆలియా.. అందాల దుల్హనియా!
ఆలియా.. అందాల దుల్హనియా!
తెరపై బొమ్మ అందంగా కనపడాలంటే సినిమా హీరోహీరోయిన్లు వేసుకున్న దుస్తులు సైతం ఆకట్టుకునేలా ఉండి తీరాల్సిందే. అందుకే మరి ఒక్కో సినిమాకి నలుగురైదుగురైనా ఫ్యాషన్ డిజైనర్లు పని చేస్తుంటారు. అయితే ‘బద్రినాథ్ కీ దుల్హనియా’ సినిమాలో మాత్రం ఈ సందడి తెరపై బొమ్మ పడకముందే మొదలై విజయయాత్రల్లోనూ కొనసాగుతోంది. ఆడియో విడుదల, ట్రైలర్, ప్రచార కార్యక్రమాలు.. ప్రతిచోటా హీరోహీరోయిన్లు ఆలియాభట్, వరుణ్‌ధావన్‌లు స్టైలిష్‌గా కనిపించి ఆకట్టుకున్నారు.
విజయ యాత్ర: సినిమా ఘన విజయం సందర్భంగా వ్యాపారవేత్త అనిల్ అంబానీ అందరికీ విందు ఏర్పాటు చేశారు. లంగా, గాఘ్రా చోళీ, చెవికి జుంకీలు, చేతులకు సన్నటి కంకణాలు ధరించి పల్లెటూరి అమ్మాయిలా పోజు కొట్టింది ఆలియా. ప్రముఖ డిజైనర్లు మనీశ్‌మల్హోత్రా, అనితా డోంగ్రేలు ఈ దుస్తుల్ని డిజైన్ చేశారు.
ట్రైలర్ విడుదల: నెక్‌లైన్ కట్‌తో నీలిరంగు మిడీ డ్రెస్.. దానిమీద జంట పక్షుల డిజైన్.. నలుపురంగు స్ట్రాపీ సాండల్స్‌తో సెంటరాఫ్ అట్రాక్షన్ ఆలియాదే. సెలెబ్రెటీ స్టైలిస్ట్ అమీ పటేల్ డిజైనర్. హెయిర్‌స్టైలిస్ట్ ఆయేషా డి విట్రే కేశాలంకరణ చేసింది. పునీత్ బి సైనీ ముఖానికి రంగులద్దాడు.
ప్రచార కార్యక్రమం: రెండ్రోజులు దిల్లీ చుట్టొచ్చినపుడు క్రియా బ్రాండు డిజైన్లు ధరించింది. నీలిరంగు గౌను, జతగా వేసిన డెనిమ్ జాకెట్‌ని ప్రభుల్ గురుంగ్ రూపొందిస్తే.. ఫ్లోరల్ ప్రింటెడ్ లాంగ్ డ్రెస్‌ని అందంగా అందించింది సచిన్ అండ్ బాబీ.
వరుణ్ రాక్: అన్నిచోట్లా ఆలియా సందడి చేసినా వరుణ్ సైతం ఆకట్టుకున్నాడు. సినిమాలో క్రికెటర్ విరాట్ అభిమాని పాత్ర పోషించి బయట మాత్రం అతడి హెయిర్‌స్టైల్‌ని అనుకరించి అదరహో అనిపించాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు
-
Movies News
IPL 2023: ఐపీఎల్ వేడుకల్లో రష్మిక, తమన్నా హంగామా.. ‘నాటు’ స్టెప్పులు అదుర్స్ అనాల్సిందే!
-
World News
Heartbreaking Story: మా అమ్మ కన్నీటితో డైరీలో అక్షరాలు తడిసిపోయాయి..!
-
World News
ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ మాయం..ఎయిర్టాగ్తో నిందితుడిని గుర్తించిన ప్రయాణికుడు
-
Movies News
Jagapathi Babu: అడవిని తలపించే ఇల్లు.. జగపతి బాబు తల్లి జీవన విధానమిది