Published : 22 Apr 2017 01:36 IST

ఐపీఎల్‌లో అందగాడు... చందురూడూ?

ఐపీఎల్‌లో అందగాడు... చందురూడూ? 

ఐపీఎల్‌ జోరు మళ్లీ మొదలైంది. ఆటతోపాటు ఆకట్టుకునే ఫ్యాషన్లు... అందంతో కనికట్టు చేసే భామల వన్నెచిన్నెల వ్యాఖ్యానాలు... ఇవన్నీ షరా మామూలే. మరి హాట్‌హాట్‌ వ్యాఖ్యానంతో మ్యాచ్‌కే సొగసులద్దే కొందరు ముద్దుగుమ్మలు ‘ఐపీఎల్‌లో హాటెస్ట్‌ ప్లేయర్‌ ఎవర’ంటే ఏం చెబుతున్నారంటే...

మందిర మనసులో విరాట్‌: వ్యాఖ్యానంతోపాటు బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ అనిపించుకున్న భామ మందిరా బేడీ. ఆటపై ప్రేమతోపాటు దూకుడు మనస్తత్వం, జట్టును ముందుండి నడిపించే సమర్థత కారణంగా విరాట్‌ కోహ్లీకి హాటెస్ట్‌ ప్లేయర్‌ కిరీటం దక్కాల్సిందేనంటోంది మందిరా.
శిబానీకి డివిలియర్స్‌: బ్యాటింగ్‌ లేదా ఫీల్డింగ్‌ ఏదైనా దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ తర్వాతే ఎవరైనా అంటోంది శిబానీ దండేకర్‌. అందుకే తన ఓటు ఏబీకే.
కరిష్మాకు అఫ్గాన్‌ బాబులు: శంకర్‌దాదా జిందాబాద్‌లో చిరుతో ఆడిపాడిన కరిష్మా కొటక్‌ గుర్తుందిగా. ఇప్పుడు ఐపీఎల్‌ ఎక్స్‌ట్రా ఇన్నింగ్స్‌లో వ్యాఖ్యాతగా బిజీ. అఫ్గాన్‌ కుర్రాళ్లు మహ్మద్‌ నబీ, రషీద్‌ఖాన్‌లు అమ్మడి మది దోచుకున్నారట.
సోనాలీకి నచ్చిన స్మిత్‌Ë: కామ్‌గా ఉంటూనే ఆటలో చెలరేగిపోయే ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ సోనాలీకి నచ్చేశాడట. ‘జట్టును ఎలా నడిపించాలో అతడికి బాగా తెలుసు. స్టీవ్‌ ఐపీఎల్‌కే అంబాసిడర్‌’ అంటోంది.

ఇంకేం చెప్పారంటే... 

* ఆస్ట్రేలియన్‌ నాథన్‌ కౌల్టర్‌నీల్‌ క్యూట్‌ అండ్‌ సెక్సీ. జెంటిల్మన్‌ లుక్స్‌తో చూడగానే ఆకట్టుకుంటాడు.
* భువనేశ్వర్‌కుమార్‌ చూపుల్నుంచి తప్పించుకోవడం ఏ అమ్మాయి తరం కాదు. వికెట్‌ తీసినపుడు చిందించే నవ్వుకు ఎవరైనా పడిపోవాల్సిందే.
* బౌలర్‌ కేన్‌ రిచర్డ్‌సన్‌ తన స్టైల్‌తోనే అమ్మాయిల గుండెల్ని పిండేస్తాడు. గరుకు గడ్డం.. సొట్టబుగ్గలు.. చిన్నపిల్లాడి నవ్వు.. అతడ్ని హాటెస్ట్‌ చేశాయి.
* పసిప్రాయం వీడని మనీశ్‌ పాండే తననుంచి చూపు మరల్చనీయడు.
* బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడాలని కోరుకోని అమ్మాయి ఉండదు. అతడి నవ్వులో రాజసం ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని