ట్యూబ్‌లైట్‌ భామ.. కబుర్లు వినుమా

ఝ ఝూ పేరే కాదు.. ఫేసూ కొత్తగానే ఉంది. అయినా మొదటి సినిమాతోనే సల్లూభాయ్‌ పక్కన నటించే లక్కీఛాన్స్‌ కొట్టేసింది. అయితే ఈ అవకాశం ఆషామాషీగా వచ్చిందేం కాదు.. తనకీ చాలానే ‘సీన్‌’ ఉంది. ఏంటది.. అంటే ఫటాఫట్‌ చదివేయండి మరి.

Published : 08 Jul 2017 01:36 IST

ట్యూబ్‌లైట్‌ భామ.. కబుర్లు వినుమా

ఝ ఝూ పేరే కాదు.. ఫేసూ కొత్తగానే ఉంది. అయినా మొదటి సినిమాతోనే సల్లూభాయ్‌ పక్కన నటించే లక్కీఛాన్స్‌ కొట్టేసింది. అయితే ఈ అవకాశం ఆషామాషీగా వచ్చిందేం కాదు.. తనకీ చాలానే ‘సీన్‌’ ఉంది. ఏంటది.. అంటే ఫటాఫట్‌ చదివేయండి మరి.

* ఝ ఝూ చైనా నుంచి దిగుమతి అయిన చిన్నది. చైనీస్‌ భాషలో ఆ పేరుకి ఎర్రని ముత్యం అని అర్థం.
* ఆమెది సైనిక కుటుంబం. తాత, తండ్రి ఇద్దరూ చైనా సైన్యం పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీలో పనిచేసినవాళ్లే. కొన్ని యుద్ధాల్లో కూడా పాల్గొన్నారు.
* మూడేళ్లపుడే పియానో వాయించడం మొదలుపెట్టింది. బాగా పాడగలదు. జాతీయస్థాయి రియాలిటీ షోలో మూడోస్థానంలో నిలిచింది.
* బీజింగ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు నేర్చుకుంది. తర్వాత అమెరికన్‌ టీవీ షో మార్కోపోలోలో మెరిసింది. చైనా ఎంటీవీ ఛానెల్లో వీజేగా అదరగొట్టింది.
* గుర్రపు స్వారీలో దిట్ట అయిన ఝు చిత్రంలోని పాత్ర స్వభావరీత్యా ఈ అవకాశం దక్కించుకుంది.
* హాలీవుడ్‌ తార మెరిల్‌ స్ట్రీప్‌ని ఆరాధించే ఝూ ఇటలీ వ్యాపారవేత్త ల్యాపో ఎల్కాన్‌తో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని