Published : 23 Dec 2017 02:03 IST

పోచంపల్లి షర్ట్స్‌

లోకల్‌ బ్రాండ్‌
పోచంపల్లి షర్ట్స్‌

కట్టుకోవడానికి కొత్తదారే సరైన మార్గం. యువత ఎప్పుడూ ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంటుంది. ఇంతవరకూ పోచంపల్లి చీరలు, చుడిదార్లు, పంజాబీడ్రెస్స్‌లే చూశాం... ఇప్పుడు పోచంపల్లి షర్ట్స్‌, నెహ్రూకోట్లు, జాకెట్లు, ఫుల్‌కోట్లు, పైజామా, న్యారోకట్‌ ప్యాంట్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. వీటినే యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక్కత్‌ డిజైన్‌లోనూ పురుషుల దుస్తుల తయారీకి డిజైనర్లు ఆసక్తి చూపుతున్నారు. చేనేతలను ప్రోత్సహించాలని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు, డిజైనర్లు చేనేత వస్త్రాలకు మార్కెట్‌ పెంచే కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే పలువురు పోచంపల్లి, ఇక్కత్‌ డిజైన్లను పురుషుల దుస్తులకు అన్వయించారు. దీంతో ఇవి ట్రెండ్‌గా నడుస్తున్నాయి. నేతన్నలకు చేయూతతో పాటు... నేటి యువత వీటిని ఇష్టపడుతుండటంతో ప్రస్తుతం వీటి హవా సాగుతోంది.

వీటి ధర : రూ.1000 నుంచి రూ. 2000 వరకూ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు