పచ్చబొట్టేసినా... ఆకట్టుకో లేమయా!

టాటూ అనేది యువతలో లేటెస్ట్‌ ట్రెండ్‌. మనసుకు నచ్చిన చిత్రాన్ని శరీరంపై....

Published : 10 Mar 2018 01:35 IST

టా‘టుస్‌’
పచ్చబొట్టేసినా... ఆకట్టుకో లేమయా!

టాటూ అనేది యువతలో లేటెస్ట్‌ ట్రెండ్‌. మనసుకు నచ్చిన చిత్రాన్ని శరీరంపై అచ్చుపోయించుకుంటారు. వివిధ కళాకృతులతో తమ తృష్ణ తీర్చుకుంటారు. అయితే ఇవి అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎంతమందికి నచ్చుతాయని అమెరికాలోని ఓ సంస్థ సర్వే చేసింది. అబ్బాయిలు ముఖ్యంగా అమ్మాయిల మనసు దోచుకోవడానికి టాటూలు వేయించుకుంటారు. అయితే దురదృష్టం ఏమిటంటే... వాటిని అమ్మాయిలు అసలు పట్టించుకోరని సర్వేలో తేలింది. ఇక అమ్మాయిలు వేళ్లు, మెడపై వేసుకొనే చిన్న టాటూలు అబ్బాయిల దృష్టిని ఆకర్శిస్తాయని తెలుసుకున్నారు. పెద్ద టాటూలు ఏవైనా అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరూ ఇష్టపడరని తెలిసిపోయింది.
* కాబట్టి కుర్రకారూ.. ఆకట్టుకోవడానికి పచ్చబొట్టులు అక్కర్లేదు... అర్థమైందా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని