వాన చుక్కలకు తడవని చొక్కా

వర్షం పడుతోంది. నానిపోని డ్రస్సులుంటే ఎంత బాగుండు! అనే వారి కోసం వానలో తడవని షర్ట్స్‌ మార్కెట్లోకి వచ్చాయి. వర్షాకాలంలో రెయిన్‌ జాకెట్లు వేసుకొని, ఫ్యాషన్‌గా కన్పించడానికి ఇబ్బంది....

Published : 14 Jul 2018 01:10 IST

ఫ్యా‘షైన్‌’
వాన చుక్కలకు తడవని చొక్కా

ర్షం పడుతోంది. నానిపోని డ్రస్సులుంటే ఎంత బాగుండు! అనే వారి కోసం వానలో తడవని షర్ట్స్‌ మార్కెట్లోకి వచ్చాయి. వర్షాకాలంలో రెయిన్‌ జాకెట్లు వేసుకొని, ఫ్యాషన్‌గా కన్పించడానికి ఇబ్బంది పడేవారికి ఇవి ఎంతో ఉపయుక్తం. ఒక ప్రత్యేకమైన దారంతో తయారు చేసిన వస్త్రంతో ఇలాంటి ట్రెండీ షర్ట్స్‌ డిజైన్‌ చేయించుకొని వేసుకోవచ్చు. రెడీమేడ్‌గా ఆన్‌లైన్‌ అంగడిలోనూ లభ్యమవుతున్నాయి. కాటన్‌ దారాన్నే హైడ్రోఫోబిక్‌-హైడ్రోఫిలిక్‌గా మార్చి ఈ కొత్తదారాన్ని ఉత్పత్తి చేశారు. ఇది ద్రవపదార్థాలను పీల్చుకోదు. ఒక్క వానే కాదు, ఇంక్‌, టీ, వైన్‌ మరకలు దీనిపై పడవు. ఇలాంటి ప్రత్యేక లక్షణాలున్న వస్త్రంతో షర్ట్‌లు కుట్టి మార్కెట్లోకి వదులుతున్నారు. ప్రస్తుతానికి దీని ధర ఎక్కువగా ఉన్నా భవిష్యత్తులో అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. అన్ని దుస్తుల్లానే వాషింగ్‌ మెషిన్‌లో ఉతుక్కొనే వెసులుబాటు ఉండటంతో యువత వీటిపై మొగ్గుచూపుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని