వానైనా ఫ్యాషన్‌ ‘అడుగు’

వర్షాకాలం... ఎక్కడ చూసిన బురద, వాన నీరు. అడుగుపెట్టాలంటే... వేసుకున్న చెప్పులు ఏమవుతాయో? కొన్న కొత్త షూ దెబ్బతింటాయేమోనని...

Published : 01 Sep 2018 01:35 IST

వర్‌షూం
వానైనా ఫ్యాషన్‌ ‘అడుగు’

వర్షాకాలం... ఎక్కడ చూసిన బురద, వాన నీరు. అడుగుపెట్టాలంటే... వేసుకున్న చెప్పులు ఏమవుతాయో? కొన్న కొత్త షూ దెబ్బతింటాయేమోనని భయం. చినుకొలొస్తున్నాయని బయటికెళ్లకుండా ఉండిపోతామా? లేదు కదా! అలాగని ట్రెండీగా కాకుండా పాత వాటర్‌ప్రూఫ్‌ షూ వేసుకుంటామా?...

మరి ఎలా?
అందుకే ఫ్యాషన్‌ డిజైనర్లు ఎప్పుడూ కొత్తదారులు వెతుకుతూనే ఉంటారు. వర్షాకాలంలోనూ ఫ్యాషన్‌ తగ్గకుండా, నీళ్లు, బురదలో పాడవకుండా ఉండే షూ తయారు చేసి మార్కెట్లోకి వదిలారు. వాటర్‌ప్రూఫ్‌ రబ్బరు, ప్లాస్టిక్‌తో వీటిని రూపొందించారు. ధరను బట్టి డిజైన్‌, సౌకర్యం ఇస్తున్నారు. ఇప్పుడివే యువతను ఆకర్శిస్తున్నాయి. రంగురంగుల్లో...  ట్రెండీగా మనసు దోచేస్తున్నాయి. మబ్బులు చుట్టుకుంటున్న వేళ... మనమూ ట్రైచేద్దామా? చినుకుల్లో జ్ఞాపకాల అడుగులు వేద్దామా...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని