పెళ్లి సంబంధాలు చూస్తా...

హైదరాబాద్‌ అంతా ఇవాంక సందడే! ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరు కానున్న ఆ మెరుపు తీగ గురించి మీకో విషయం తెలుసా? ఇవాంక, తన భర్త జెర్డ్‌ కుష్నెర్‌ ఇద్దరూ మ్యాచ్‌మేకర్లట. ఆ రహస్య ప్రతిభ గురించి ఇతరులకు తెలీదట. ఈ మధ్యే ఓ పాశ్చాత్య వార్తా ఛానల్‌ ఇంటర్వ్యూలో....

Published : 25 Nov 2017 01:51 IST

పెళ్లి సంబంధాలు చూస్తా...

హైదరాబాద్‌ అంతా ఇవాంక సందడే! ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరు కానున్న ఆ మెరుపు తీగ గురించి మీకో విషయం తెలుసా? ఇవాంక, తన భర్త జెర్డ్‌ కుష్నెర్‌ ఇద్దరూ మ్యాచ్‌మేకర్లట. ఆ రహస్య ప్రతిభ గురించి ఇతరులకు తెలీదట. ఈ మధ్యే ఓ పాశ్చాత్య వార్తా ఛానల్‌ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పింది. ఇప్పటికి ఏడు పెళ్లి సంబంధాలు కుదిర్చి పెళ్లి చేశారట. అన్ని జంటల కాపురాలు హాయిగా సాగుతున్నాయనీ, ఎవ్వరూ ఇప్పటికైతే విడాకులు తీసుకోలేదని, దేవుడి దయతో మా ప్రతిభ ఇలా కొనసాగుతోందని చమత్కరించింది. ఇంకా చెప్పాలంటే... ‘ఇవాంక ట్రంప్‌’ పేరుతో కంపెనీ స్థాపించి ఫ్యాషన్‌ యాక్ససరీస్‌, బంగారం, స్పా, హ్యాండ్‌బ్యాగులు, దుస్తుల వ్యాపారాల్ని భర్తతో కలిసి నిర్వహిస్తోంది. రచయిత్రిగా ‘ది ట్రంప్‌ కార్డ్‌, విమన్‌ హు వర్క్‌’ పేర్లతో రెండు పుస్తకాలు కూడా రాసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని